లావుగా ఉన్న వాళ్ళు ఇలా చేయండి చాలు…  

మనం హెల్త్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎదో ఒక అనారోగ్య సమస్య వస్తునే ఉంటుంది.ఈ కాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారిపోయింది.ఈ అలవాటే మనకి అనేక రకాల జబ్బులని తెచ్చి పెడుతున్నాయి. ఉబకాయం ,శరీర బరువు పెరగడం వంటి సమస్యలు ఈ జంక్ ఫుడ్స్ వలన ఎక్కువగా వస్తుంటాయి.వీటి వలన అధిక బరువు పెరగడమే కాదు..

-

బరువు పెరగడం వలన అనేక రకాల జబ్బులు వచ్చి చేరుతాయి. అయితే ఈ అధిక బరువుని తమలపాకులతో కంట్రోల్ చేయవచ్చు.

మన ఆయుర్వేద శాస్త్రంలో బరువు తగ్గించుకోడానికి తమలపాకులను ఎలా ఉపయోగిస్తారో క్లుప్తంగా వివరించారు మన పూర్వీకులు. తమల పాకులో ఉండే ముఖ్యమైన గుణం జీర్ణక్రియని మెరుగుపరచడం.శరీరంలో ఉండే బరువుని పెంచే కొవ్వు ని కరిగించడంలో తమలపాకు బాగా ఉపయోగపడుతుంది.

గ్యాస్ట్రిక్ ఆమ్లాల వలన వచ్చే చెడు ప్రభావాల నుండి ఉదర పూతను రక్షిస్తుంది. మనం రోజు తినే ఆహారంలో తమల పాకులు ,మిరియాలు కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం లక్షణాలను పూర్తిగా తొలగిస్తాయిప్రతీరోజు ఉదయం ఒక తమలపాకులో,మూడు మిరియపు గింజలు తీసుకుని రెండిటిని కలిపి నమిలి మింగాలి.మిరియాలలో ఉండే ఫ్యాటో న్యూట్రియంట్స్, పెప్పేరిన్ ఉండటం వల్ల కొవ్వు ని కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మిరియాలు కడుపులో ప్రారంభ దశలో ఉండే క్యాన్సర్ కణాలని కూడా చంపేస్తాయి.