రోజుకి 3 లవంగాలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

మనం సాధారణంగా లవంగాలను వంటల్లో వాడుతూ ఉంటాం.అలాగే లవంగాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 3 --TeluguStop.com

లవంగాలలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, మాంగనీస్, విటమిన్ A,C లు సమృద్ధిగా ఉంటాయి.ప్రతి రోజు మూడు లవంగాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి గ్యాస్,అసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.

లవంగం మొగ్గలో యాంటీ బాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది.

మధుమేహం (డయాబెటిస్) సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు లవంగాలను తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబ్దదీకరిస్తుంది.

దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

లవంగాల్లో ఎముకలను రక్షించే అనేక సమ్మేళనాలు ఉండుట వలన వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ఆస్టియో పోరోసిస్ అంటే ఎముకలు బలహీనంగా లేకుండా చేస్తుంది.

లవంగాలలో యాంటీ ఇన్‌ప్లామేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పులు,వాపులను తగ్గించటంలో సహాయపడుతుంది.

నోటి దుర్వాసనను తగ్గించటమే కాకుండా దంతాలను బలంగా మార్చుతుంది.

తలనొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని పాలలో చిటికెడు లవంగాల పొడి వేసుకొని త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

జలుబు చేసి ముక్కులు దిబ్బడతో ఇబ్బందిగా ఉన్నప్పుడు కర్చీఫ్ మీద రెండు మూడు చుక్కల లవంగ నూనెని చల్లి వాసన పీలిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

7,8 లవంగాలను గిన్నెడు నీళ్లలో వేసి మరిగించి ఆవిరి పడితే కూడా ఉపశమనం లభిస్తుంది.

వారానికి ఒకసారి లవంగం టీని త్రాగితే శరీరానికి అవసరమైన శక్తి లభించటమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు