రోజా 'జబర్దస్త్‌' గెలుపు... ఏ మంత్రి పదవి దక్కనుంది?  

రోజా Roja Win As Ysrcp Mla-ap Cm Jagan,minister Roja,mla Roja,ఏపీ సి‌ఎం జగన్,మంత్రి రోజా,రోజా,సి‌ఎం జగన్

ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు చాలా దూరం వెళ్లి పోయిమ రీ వైకాపా ఆధిక్యంను కనబర్చుతోంది. అద్బుతమైన ప్రభంజనంతో వైకాపా అధికారం దక్కించుకోబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా రోజా గెలిచిందా లేదా అనే అనుమానంను వ్యక్తం చేశారు..

రోజా 'జబర్దస్త్‌' గెలుపు... ఏ మంత్రి పదవి దక్కనుంది?-రోజా Roja Win As Ysrcp Mla

ఎందుకంటే ఎగ్జిట్‌ పోల్స్‌లో రోజా ఓడిపోయే అవకాశం ఉందనే ఫలితం వచ్చింది. దాంతో వైకాపా గెలిస్తే రోజాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే ఆమె ఓడిపోతుందా అనే ఆందోళన ఆమె అభిమానుల్లో వ్యక్తం అయ్యింది.

నేడు ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ మొదలైనప్పటి నుండి కూడా రోజా అటు ఇటుగా ముందంజలోనే ఉంటూ వచ్చింది.

నగరి నియోజక వర్గంలో తన ప్రత్యర్థి టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్‌పై 2,681 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. రోజాకు ఈ గెలుపు చాలా పెద్ద అవకాశంను తెచ్చి పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రోజాకు ఖచ్చితంగా జగన్‌ మంత్రి వర్గంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీలో రోజాను మించిన మహిళ నాయకురాలు లేరు.

అందుకే ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవిని జగన్‌ ఆఫర్‌ చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఆమెకు ఏ పోర్ట్‌ పోలియో దక్కనుంది అనేది చూడాలి. గతంలో రాజశేఖర్‌ రెడ్డి సబిత ఇంద్రారెడ్డికి హోం ఇచ్చాడు.

ఇప్పుడు రోజాకు కూడా జగన్‌ హోం ఇస్తే బాగుంటుందనే టాక్‌ వినిపిస్తుంది.