రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్, ఈ ఫోటోయే సాక్ష్యం! ఇంతకీ అతనెవరు?       2018-06-24   23:24:17  IST  Raghu V

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనకు మరొక తోడు దొరికిందని, ఇపుడు జీవితం చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను కొన్ని రోజుల క్రితం పోస్టు చేశారు. తాజాగా రేణు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ ఫోస్టు చేయడం ద్వారా తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఆమె అఫీషియల్‌గా ప్రకటించారు.

తన నిశ్చితార్థంలో తన పిల్లలు కూడా తనతో పాటే ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “నా పిల్లలు నాతోపాటు లేకపోతే నా సంతోషానికి అర్థం లేనట్టే. నా జీవితంలో సంతోషకరమైన భాగాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరూ పక్కనే ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది” అంటూ పోస్ట్ చేశారు.

-

బద్రి సినిమాతో పవన్, రేణు దగ్గరయ్యారు. అయితే వివాహం 2009లో జరగగా… 2012లో విడాకులు తీసుకున్నారు. అనంతరం అన్నా లెజినోవాను పవన్ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి గురించిగానీ, అతడి పేరుగానీ రేణు దేశాయ్ వెల్లడించలేదు. అయితే అతడు కూడా భార్యతో విడాకులు అయిన వ్యక్తే అని తెలుస్తోంది. ఈ ఫోటోలో ఉన్న మరో పాప అతడి కూతురుగా భావిస్తున్నారు.