రెడ్ మీ ఫోన్ రూ.1 కే కోనేయ్యండి ఇలా     2017-09-24   04:55:50  IST  Raghu V

-

-

భారతీయ మొబైల్ మార్కెట్ లో రెండోవ అతిపెద్ద కంపెని అయిన షియోమి ఎప్పట్టికప్పుడు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ ని మార్కెట్ లోకి దింపడమే కాదు, మంచి మంచి ఆఫర్స్ ని అందిస్తూ రోజు రోజుకి మార్కెట్ స్థాయిని పెంచుకుంటోంది. గత ఏడాది ఇదే దసరా – దీపావలి సమయంలో రూ1 కే కొన్ని లిమిటెడ్ స్మార్ట్ ఫోన్స్ ని అందించి వినియోగదారులని విపరీతంగా ఆకట్టుకున్న షియోమీ, ఈ ఏడాది కూడా అలాంటి ఆఫర్ నే పట్టుకొచ్చింది. దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా, రూ.1 స్మార్ట్ ఫోన్ సేల్స్ ని మళ్ళీ ఓపెన్ చేస్తోంది. ఈ స్పెషల్ సేల్స్ ఎప్పుడు ఉన్నాయో, ఎలా పార్టిసిపేట్ చేయాలి వివరాలు చూడండి.

దివాలి విత్ ఏంఐ సేల్స్ సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబర్ 29 వరకు జరుగుతాయి. ఈ సేల్స్ ఇటు mi స్టోర్ యాప్ లో, అటు mi.com లో నిర్వహిస్తారు. ఈ మూడురోజులు ఉదయం 10 గంటలకు కూపన్స్ ఇస్తారు. ఈ కూపన్స్ ని మీరు యాప్ లో ఉండే, దియా గేమ్ లో పార్టిసిపేట్ చేసి పొందవచ్చు. కూపన్స్ వలన మీరు mi స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికారాలపై మంచి డిస్కౌంట్ పొందగలరు.ఇక ఫ్లాష్ సేల్స్, అదే రూ.1 కే స్మార్ట్ ఫోన్ మరియు ఇతర పరికరాల అమ్మకం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఈ మూడు రోజులు కొనసాగుతుంది. చాలా లిమిటెడ్ మొబైల్స్ ని అమ్మకంలో పెడతారు. ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది. చాలా తక్కువ మందికి ఈ ఆఫర్ చేతికి చిక్కుతుంది. Redmi Note 4, Redmi 4, MI 4A, MI Router 3C, MI earphones, MI selfie స్టిక్ లాంటి ప్రాడక్ట్స్ ని ఫ్లాష్ సేల్స్ లో పెడుతున్నారు.

మీరు ఫ్లాష్ సేల్స్ లో మొబైల్ ని కొనలేకపోతే, డిస్కౌంట్ లో కొనుక్కోండి. SBI debit, credit cards మీద 1000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది mi. అదే PAYTM ని కడితే, రూ.400 డిస్కౌంట్. ఆ రోజుల్లో Redmi Note 4 పై ఏకంగా రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. Mi Max పై రూ.2000, Redmi 4 పై రూ.1500 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇలా దాదాపు ప్రతి ప్రాడక్ట్ పై ఎంతో కొంత డిస్కౌంట్ లభిస్తుంది. మరికేం … 27 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్ .. ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి.