సూర్యాపేట జిల్లా :కోదాడ-మేళ్లచెరువు రోడ్డులోని ఎర్రవరం గ్రామ శివారులో రెండు బైక్ లు ఎదురెదుగా ఢీ కొన్న ఘటనలో ఒకరు స్పాట్ లో మృతి చెందగా,నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి.బుల్లెట్,గ్లామర్ బైక్ లు ఎదురెదుగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
దీనితో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి,క్షతగాత్రులను చికిత్స నిమిత్తం,మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.