రికార్డుల కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ పైత్యం     2017-09-22   04:41:41  IST  Raghu V

-

-

మొదటిరోజు రికార్డు అనేది చాలా ప్రెస్టేజి మ్యాటర్ హీరోల అభిమానులకి. తమ హీరో ఓపెనింగ్ డే తమవంతు భాగం ఉండాలని వందలు, వేలు పెట్టి బెనిఫిట్ షోలు చూస్తారు. మొదటిరోజు రెండుమూడు షోలు వేస్తారు. థియేటర్స్ ని హైర్ తీసుకుంటారు. వర్త్ షేర్ లేకపోయినా, DCR మాత్రం నిండేలా, సొంత జేబులోంచి డబ్బు తీసి కడతారు. ఇలాంటి పిచ్చి ప్రేమ పనులు అందరు హీరోల ఫ్యాన్స్ చేసేదే. కాని నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ చేసారంతే.

మొదట నైజాం విషయం మాట్లాడుకుంటే, RTC X Roads లో 7 షోలకి వర్త్ ఫుల్స్ లేకపోయినా, ఫ్యాన్స్ DCR ఫుల్స్ చేయించారట. థియేటర్ వాడు ఊరికే DCR ఫుల్ చూపించడుగా, డబ్బులు కట్టాల్సిందే‌. కృష్ణ జిల్లాలో జైలవకుశ మొదటిరోజు వర్త్ షేర్ 1.37 కోట్లు వస్తే, హైర్స్, మినిమం గ్యారంటీలు, బెనిఫిట్ షోలు కలిపి మరో 33 లక్షల దాకా వచ్చాయి‌. అది ఒకే, అందరు హీరోలకి ఇలానే చేసుకుంటారు ఫ్యాన్స్. కాని క్యాన్సల్ చేసుకున్నా ఎమౌంట్లను కూడా చివరి నిమిషంలో కట్టారట‌. ఎందుకు అంటే ఓపెనింగ్ రికార్డు కోసం. మొత్తానికి అయితే కృష్ణ జిల్లాలో నాన్ బాహుబలి రికార్డు కొట్టేసారు‌. ఖైదీ నం 150 ని తమ అభిమానంతో దాటించారు‌.

హీరోలపై ఇలాంటి అభిమానాన్ని మనం తప్పుబట్టడానికి లేదు, అలాగే సపోర్ట్ కూడా చేయలేం. ఎవరిష్టం వాళ్ళది అన్నట్లుగా చూసి చూడనట్టు ఉండటమే.