రాజమౌళి కోసం త్రివిక్రమ్ ని మళ్ళీ మోసం చేయనున్న మహేష్ బాబు?     2017-09-24   05:36:55  IST  Raghu V

-

-

మహేష్ బాబు – త్రివిక్రమ్ .. ఇద్దరు మంచి స్నేహితులే. అప్పటికి ఒకేఒక్క సినిమా డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ కి అతడు సినిమా అవకాశమిచ్చాడు మహేష్. ఆ సినిమా క్లాసిక్ గా నిలిచింది. అదే ఊపులో చేసిన రెండొవ సినిమా ఖలేజా మాత్రం దారుణంగా విఫలమైంది. కాని ఆ తరువాత కూడా మహేష్ – త్రివిక్రమ్ కథాచర్చలు జరిపారు. మహేష్ డేట్స్ ఇస్తానన్నాడు. కాని ఏళ్ళు గడుస్తున్నా, డేట్స్ ఇవ్వడం లేదు.

స్పైడర్ పూర్తి చేసిన మహేష్, శ్రీమంతుడు కి ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ కి డేట్స్ ఇవ్వకుండా, మళ్ళీ కొరటాల శివకే డేట్స్ ఇచ్చాడు. భరత్ అనే నేను పూర్తయిన తరువాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పేసుకున్నాడు. ఈ సినిమా తథ్యం. ఎలాంటి మార్పులు ఉండవు. ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని కొన్ని నెలల క్రితం చెప్పిన మహేష్, మళ్ళీ హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు..

నిన్న మీడియాతో ముచ్చటించిన సూపర్ స్టార్, రాజమౌళి తో తన సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని, ఇద్దరం కమిట్ మెంట్స్ నుంచి ఫ్రీ అయ్యాక, బహుషా 2018 చివర్లో సినిమా మొదలుపెడతామని స్పష్టంగా చెప్పేసాడు మహేష్. ఈ లెక్కన వంశీ పైడిపల్లి సినిమా తరువాత జక్కన్నతో సినిమా చేస్తాడు మహేష్. అంటే త్రివిక్రమ్ ని మళ్ళీ మోసం చేస్తున్నట్లేగా?