రాజకీయం అంటే ఇదే బాబు ! శృతిమించిన మోత్కుపల్లి లొల్లి !       2018-06-05   03:59:38  IST  Bhanu C

రాజకీయం ఎలా ఎప్పుడు మారుతుందో చెప్పలేం. నిన్నటివరకు కావలించుకుని తిరిగినవారు నేడు కత్తులు దూసుకునే పరిస్థితి రావచ్చు. ఇదే నిరూపిస్తున్నారు తెలంగాణ లో టీడీపీ ముఖ్యనేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కు తాను కవచం అంటూ ప్రచారం చేసుకున్న సీనియార్ టిడిపి నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు మీద గట్టిగానే విరుచుకుపడ్డారు.

బాబు పెద్ద మోసగాడని, ఎలా ప్రజలను వంచిస్తాడు..ఆయన అవినీతికి ఎలా పాల్పడాతారు..ఇలా అనేక విషయాలపై మోత్కుపల్లి తన స్వరం పెంచి మాట్లాడుతుంటే మహానాడులో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి బాబు మీద ఆరోపణలు చేస్తుంటే వాటికి ధైర్యంగా సమాధానం చెప్పే స్థితిలో టీడీపీ నాయకులు ఎవరూ లేకుండాపోయారు.

రాజకీయాలలో ఒకసారి అసంతృప్తి వస్తే ఎలాంటి విమర్శలు వచ్చే అవకాశం ఉందో మోత్కుపల్లి రుజువు చేశారు.చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న విషయం, వంద కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న తీరు. ఓటుకు నోటు కేసులో రేవంత్ , చంద్రబాబు ఇద్దరూ ముద్దాయిలేనని, మగాడిగా నిరూపించుకోవడానికి కెసిఆర్ ఆ కేసును ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పిన వైనం ఇవన్ని కూడా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా తెలుగు సమాజంలో చర్చనీయాంశాలే అవుతాయి.అలాగే ప్రదాని మోడీని గతంలో పొడిగిన చంద్రబాబు ఇప్పుడు విమర్శిస్తున్న సంగతులు, నోట్ల రద్దు ఘనతే తనదే అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా రివర్స్ లో మాట్లాడడం వంటి యూటర్న్ ల గురించి కూడా మోత్కుపల్లి దంచేశారు.

రాజకీయాలలో పరిస్థితులు ఎదురు తిరగడం మొదలైతే ఇలాగే ఉంటుందనుకోవాలి. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చెప్పినప్పటి నుంచి చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలన్నీ ఆయనకు ఎదురుతిరుగుతున్నట్లే ఉన్నాయి. బీజేపీకి దూరం కావల్సి రావడం, పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం, ఇద్దరు బిసి ఆడ్వకేట్లకు జడ్జి పదవులు రాకుండా అడ్డుపడడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టడం, సుప్రిం కోర్టు జడ్జి ఒకరు చంద్రబాబును కాపాడుతున్న తీరును కూడా ఆయన బహిర్గతం చేయడం , టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆభరణాల గల్లంతు వంటివి , బ్రాహ్మణులతో తగాదా ఇవన్ని వెరసి ఒకదానిపై ఒకటి వచ్చి చంద్రబాబుపై మీద పడుతున్నాయి.ఈ క్రమంలో మోత్కుపల్లి ఆరోపణలు కూడా తెలుగుదేశానికి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి.