యువ దర్శకులకు ఛాలెంజ్‌ విసరబోతున్న దర్శకేంద్రుడు.. 50 లక్షలతో ప్రయోగం     2018-10-08   10:56:49  IST  Ramesh P

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న చిత్రాల జాతర కొనసాగుతుంది. మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాను ప్రేక్షకులు బాగా ఆధరిస్తున్నారు. అది ఎంత బడ్జెట్‌తో వచ్చిందనే విషయాన్ని పట్టించుకోకుండా జనాలు సినిమాలను ఆధరిస్తున్న నేపథ్యంలో పెద్ద నిర్మాతలు అయిన సురేష్‌బాబు, దిల్‌రాజు వంటి వారు కూడా చిన్న చిత్రాల వెంట పరుగులు తీస్తున్నారు. భారీ అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల కంటే ఇలా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలకు ఎక్కువ లాభాలు వస్తున్న కారణంగా దర్శకులు కూడా చిన్న బడ్జెట్‌ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటి వరకు కొత్త దర్శకులు మాత్రమే ఇలా చిన్న బడ్జెట్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు వారికి ఛాలెంజ్‌ను విసిరేందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సిద్దం అయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈమద్య మళ్లీ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 50 లక్షల బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు.

అప్పట్లో భారీ బడ్జెట్‌ చిత్రాలను తెరకెక్కించిన ఘనత రాఘవేంద్ర రావుది. అప్పట్లో ఈయన బడ్జెట్‌కు నిర్మాతలు ఒణికి పోయేవారు. అదే సమయంలో ఆ సినిమాలో భారీగా వసూళ్లు సాధించాడు. భారీ బడ్టెజ్‌ చిత్రాలకు నాంది పలికిన దర్శకుడు రాఘవేంద్ర రావు. ఇప్పుడు ఆయనే కేవలం 50 లక్షలతో మూవీని చేయాలనుకోవడం నిజంగా ప్రయోగం అని చెప్పాలి. తనలో తక్కువ బడ్జెట్‌తో సినిమా చేసే సత్తా కూడా ఉందని నిరూపించుకునేందుకు దర్శకుడు ఈ ప్రయత్నం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంతో యువ దర్శకులకు రాఘవేంద్రరావు సవాల్‌ విసరబోతున్నాడు.