యుద్ధం శరణం మూవీ రివ్యూ  

2.75.

చిత్రం : యుద్ధం శరణం

కథలోకి వెళితే :

ఒక మినిస్టర్ (వినోద్ కుమార్) 3 వేల కోట్ల స్కాం నుంచి అందరి దృష్టిని మళ్ళించేందుకు నగరంలో ఓ పెద్ద బాంబు ఎటాక్ ప్లాన్ చేస్తాడు. ప్లాన్ మినిస్టర్ ది అయితే, దాన్ని అమలుపరిచేవాడు నాయక్ (శ్రీకాంత్). ఈ దాడుల్లో తన తల్లిదండ్రులను కోల్పోతాడు అర్జున్ (నాగచైతన్య). సంతోషంగా, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకపోయినా, అనుబంధాలతో ఉన్న కుటుంబం ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్ళిపోతుంది..

-

అక్కడితో ఆగని నాయక్, అర్జున్ తో మిగిలి ఉన్న మిగితా కుటుంబసభ్యులని కూడా బలి తీసుకోవాలనుకుంటాడు.

అసలు ఈ బాంబు బ్లాస్టులకి అర్జున్ కుటుంబానికి ఏమిటి సంబంధం? అర్జున్ తన పగ తీర్చుకున్నాడో లేదో తెర మీద చూడండి.

నటీనటుల నటన :

నాగచైతన్యకి కెరీర్ కి ఇది ఓ కొత్త పాత్రనా అంటే చెప్పలేం.

మంచి ఇంటన్సిటి ఉంటుంది. కాని సరిగా రాసుకొని సన్నివేశాల వలన పాత్రలో బరువు కనిపించదు. అయినాసరే, తనవంతు కృషి చేసాడు చైతన్య.

సినిమా తేడా కొట్టినా, చైతన్య మాత్రం ఫెయిల్ అవ్వడు. గ్రే క్యారక్టర్ లో శ్రీకాంత్ ఆదరగోట్టినా, తన పాత్ర నిడివి తక్కువగా ఉండటం ప్రేక్షకుల దురదృష్టం. ఫస్టాఫ్ లో అయితే విలన్ లా కాకుండా, ఎదో కామియో రోల్ లో ఉన్నాడా అనిపిస్తుంది.

శ్రీకాంత్ కాలిబర్ కి ఇంకా బాగా రాసుకోవాల్సింది సన్నివేశాలు. నటనాపరంగా చెప్పుకుంటే, శ్రీకాంత్ ఈ చిత్రానికి అతిపెద్ద హైలెట్. లావణ్య అందంగా ఉంది.

ఉన్నంతలో బాగానే చేసింది. ఇటు రావు రమేష్, అటు రేవతి . ఇద్దరు షరామామూలే. తమ పాత్ర పరిధి మేరలో తమకు అలవాటు అయిన నటనని కనబరిచారు.

టెక్నికల్ టీం :

నికేత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది.

నీవల్లే అనే పాట చాలా అందంగా అనిపిస్తుంది. ఫ్రేమ్స్ బాగున్నాయి. వివేక్ సాగర్ సంగీతం సినిమా టోన్ కి తగ్గట్టుగా సింప్లిస్టిక్ గా బాగుంది.

తెర మీద కూడా పాటలు బాగుండటంతో ఫస్టాఫ్ మెల్లిగా, హాయిగా సాగిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో బాగా దెబ్బతీసింది.

ఫ్లాష్ బ్యాక్ టూ ప్రెజెంట్ నరేషన్ కొత్తదేమీ కాదు, కాని ఇలాంటి నరేషన్ లో కూడా సినిమా కదలనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

ఒక చింతలేని కుటుంబం, ఓ పెద్ద కుట్రలో అనుకోకుండా చిక్కుకుంటే అంత చిన్నాభిన్నం.

తన ముందే కుటుంబం కూలిపోతుంటే కుర్రాడు ఎలాంటి సాహసాలు చేసాడు? ఇలాంటి కథలు ఒకటా, రెండా, ఎన్నో వచ్చాయి. 1970ల నుంచే ఇలాంటి కథలను చూస్తున్నాం మనం. కాబట్టి కథావస్తువే పాతది ఎంచుకోవడంతో సినిమా మీద అమితమైన ఆసక్తి పెంచుకోవడం కష్టం. థ్రిల్లర్ అన్నట్టే కాని, కుటుంబ అంశాలనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్.

థ్రిల్ కి వచ్చేసరికి, థ్రిల్ కరువు అవడంతో సినిమా నిస్సారంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి కథల్లో విలన్ చాలా ఇంపార్టెంట్. కాని శ్రీకాంత్ లాంటి అద్భుతమైన నటుడిని పూర్తిగా వాడుకోలేకపోయారు.

సెకండాఫ్ లో చాలా ఎలిమెంట్స్ సినిమాటిక్ గా అనిపిస్తాయి. అసలే చప్పగా సాగుతున్న సెకండాఫ్ లో అదో పెద్ద సమస్య. దాంతో ఇటు ఫ్యామిలి జానర్ కి, అటు థ్రిల్లర్ జానర్ కి, రెండిట్లో దేనికి న్యాయం చేయకుండా ముగిసిపోతుంది యుద్ధం శరణం.

నరేషన్ స్లో గా ఉండటంతో ఇది బి అండ్ సి ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే అనిపిస్తోంది. పోనీ థ్రిల్లర్ కాబట్టి కొత్తరకమైన కథని ఎంచుకొని క్లాస్ ఆడియెన్స్ కి అయినా నచ్చేలా తీసారా అంటే అది కూడా లేదు. అలాగని పూర్తిగా తీసిపారేయ్యలేం.

ఏ క్లాస్ ఆడియెన్స్ కోసం కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. * శ్రీకాంత్ నటన

* పాటలు

* ఫ్యామిలి సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

.

* పాత కథావస్తువు

* నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే .

* చప్పగా ఉండే సెకండాఫ్ .

* థ్రిల్లర్ లో ఉండాల్సిన నిజాయితీ లేకపోవడం

చివరగా :

.

ప్రేక్షకుల ఓర్పు పై సెకండాఫ్ యుద్ధం

రేటింగ్ : 2.75/5