యాదాద్రి ఆలయ దర్శన వేళలు మార్పు

యాదాద్రి జిల్లా: ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శన వేళలు మారనున్నట్లు దేవస్థాన అధికారులు,అర్చక బృందం వెల్లడించారు.ఆలయ ఉద్ఘాటన ఈ నెల 28న ప్రధానాలయ ఉద్ఘాటన,మహాకుంభ సంప్రోక్షణ, శాంతి కల్యాణోత్సవ పర్వాలు శ్రీవైష్ణవ పాంచరాతాగమ శాస్త్రరీతిలో కొనసాగనున్నాయని తెలిపారు.

 Yadadri Temple Visit Times Change-TeluguStop.com

అయితే ఆలయ ఉద్ఘాటన అనంతరం ఆలయ సందర్శనకు విచ్చేసే భక్తులకు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువుల దర్శనాలు,ఆలయంలో ప్రతి నిత్యం జరిపే ఆర్జిత సేవోత్సవ వేళలను దేవస్థాన ఈవో ప్రకటించారు.కాగా ఆలయ పునరిర్మాణంలో భాగంగా తాత్కాలిక బాలాలయంలో జరిపిన ఆర్జిత సేవలను మార్పు చేస్తున్నట్టు,ఆలయ పునర్నిర్మాణం అనంతరం స్వయంభువులు కొలువుదీరిన గర్భాలయంలో కొనసాగే నిత్య విధి కైంకర్యాలు,ఆర్జిత సేవల సమయాలను ఆలయ ఈవో వెల్లడించారు.ఆలయ ఉద్ఘాటన అనంతరం స్వయంభువుల ఆలయంలో నిత్య పూజాకైంకర్యాలు కొనసాగుతాయని,3 గంటలకు ఆలయ తెరుచుట ఉదయం 3గంటల నుంచి 3.30 గంటలకు సుప్రభాతం,ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు బిందె తీర్థం,ఆరాధన,ఉదయం 4గంటల నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి బాలభోగం,ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిజాభిషేకం,ఉదయం 5.30 గంటల నుంచి 5.45 గంటల వరకు అలంకార సేవ, ఉదయం 5.45 గంటల నుంచి 6.30 వరకు స్వామివారికి సహస్రనామార్చన,ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన,ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు సర్వ దర్శనాలు,ఉదయం 8గంటల నుంచి 9గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం, ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు సర్వదర్శనాలు,మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు మాధ్యాహ్న రాజభోగము, మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 4 గంటల వరకు సర్వ దర్శనాలు,సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం,సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సర్వ దర్శనాలు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు తిరువారాధన,రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, ఆండాల్ అమ్మవారికి కుంకుమార్చన,రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు సర్వదర్శనాలు, రాత్రి 9.15 గంటల నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన ఆరగింపు,రాత్రి 9.45గంటల నుంచి 10గంటల వరకు శయనోత్సవ దర్శనం,ప్రధానాలయ ద్వార బంధనం,ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.15 గంటల వరకు జరిగే సర్వదర్శన వేళల్లో సువర్ణపుష్పార్చన,వేదాశీర్వచనం,ఉదయం 8.30 గంటల నుంచి 10గంటల వరకు సుదర్శన నారసింహ హోమం,ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణోత్సం, బ్రహ్మోత్సవం,సాయంత్రం 5గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి వెండి జోడు సేవోత్సవాలు,సాయంత్రం 6.45 గంటల నుంచి 7 గంటల వరకు దర్భారు సేవ,ప్రతీ మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు విష్ణుపుష్కరిణి,ప్రధానాలయంలోని క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు,ప్రతీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవోత్సవం ఉంటుందని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube