యాంకర్ సుమ నోరు, ముక్కు నుండి పొగలు..! వీడియో చూస్తే షాక్ అవుతారు.!       2018-06-07   00:23:04  IST  Raghu V

సుమ కనకాల..తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి.యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది..స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.. అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు.ఒకవైపు టివి ప్రోగ్రాములు,మరోవైపు ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సుమ.

ఇటీవలే ఫేస్బుక్ లో ఆంచారు సుమ ఒక ఫన్నీ వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో సుమ చల్లటి ఐస్‌క్రీమ్ తింటూ ఆమె నోరు, ముక్కు నుంచి పొగలు వదులుతున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుతున్నారు. సుమ యాంకరింగ్‌లోనే కాదు.. నవ్వించడంలోనూ తనకు తానే సాటి అని అంటున్నారు.

-

కాగా ఓ చోట ఐస్ క్రీమ్ తింటూ సుమ వీడియో తీసుకున్నారు. అది మామూలు ఐస్‌క్రీమ్ కాదట. దాన్ని తింటే నోరు, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందేనట. సుమ ఈ ఐస్‌క్రీమ్‌ని తింటూ తమదైన శైలిలో హావభావాలు ఒలకించారు. ఐస్‌క్రీమ్ తింటుంటే ఓ డ్రాగన్ వదిలే శ్వాసలా ఇలా పొగ వస్తోందని సుమ తెలిపారు. అయితే ఈ ఐస్‌క్రీమ్ ఎక్కడ, ఎప్పుడు తిన్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
Click here to watch video