యాంకర్ ఝాన్నీ భర్త ఎవరో తెలుసా.? ఆయనతో విడిపోవడానికి కారణం తెలుస్తే షాక్ అవుతారు.!       2018-05-20   00:57:59  IST  Raghu V

తెలుగు టీవీ చానెల్స్ లో సుమ తర్వాత ఫేమస్ యాంకర్ ఎవరు అంటే గుర్తొచ్చేది “ఝాన్సీ” గారు. బాగా చలాకీగా యాంకరింగ్ చేయడంలో ఝాన్నీ స్టైలే వేరు.. ఇప్పటికీ పలు చానెల్స్ లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.అయితే పదేళ్ల కింద జెమినీ టీవీలో ప్రసారమైన ఒక ప్రోగ్రామ్ ఝాన్నీ లైఫ్ ను మలుపు తిప్పింది. జెమినీ టీవీలో వచ్చిన ఆ ప్రోగ్రాంలో ఝాన్సీ రోజుకో భిన్న గెటప్ తో సినిమాలపై విశ్లేషణలు చేసింది. ఆ కార్యక్రమానికి ఇప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న జోగినాయుడు ప్రోగ్రాం డైరెక్టర్ గా చేసేవాడు. ఇలా ఝాన్సీ, జోగినాయుడు మధ్య పరిచయం, ప్రేమగా మారి వీరిద్దరి పెళ్లి వరకూ దారి తీసింది.

కానీ పెళ్లి అయ్యాక ఝాన్సీ జీవితంలో కష్టాలు ఎక్కువ అయ్యాయి. భర్త ప్రవర్తన, అతడి పద్ధతి నచ్చక అతడి నుంచి విడిపోయింది. అయితే అతడు మాత్రం ఈమెను వదల్లేదు. అక్కడితో ఆగకుండా తన భార్య మంచిది కాదంటూ ఇండస్ట్రీలో ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్నీ అనేకసార్లు ఇంటర్వ్యూలో ఝాన్సీ చెప్పారు. అంతేకాదు ఝాన్నీ కి టీవీ ప్రోగ్రాం అవకాశాలు కూడా రాకుండా జోగినాయుడు చేశాడని విమర్శలున్నాయి.

ఇక సహించలేక ఝాన్నీ కోర్టుకు వెళ్లి జోగినాయుడు నుంచి విడాకులు తీసుకోవడానికి పిటీషన్ వేసింది. దాదాపు సంవత్సరం తర్వాత కష్టపడి విడాకులు సాధించింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు భర్తతో ఇబ్బందులు పడింది. ఝాన్నీ పడ్డ కష్టం మామూలుది కాదని.. ఆమె సన్నిహితులు కూడా అంటూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఝాన్నీ పెద్దగా ఆస్తులు కూడా సంపాదించలేదట.. ఆమెకు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.