యవన్నంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి     2018-05-22   02:10:53  IST  Lakshmi P

ప్రతి ఒక్కరు వృద్ధాప్య లక్షణాలు కనపడకుండా అందంగా,యవన్నంగా ఉండాలని కోరుకోవటం సహజమే. అయితే వయస్సు పెరిగే కొద్దీ వృద్దాప్య లక్షణాలు కనపడటం సహజమే. ముఖం మీద ముడతలు రావటం వలన వయస్సు మీద పడినట్టు కన్పిస్తుంది. అప్పుడు ఖరీదైన కాస్మొటిక్స్ వాడకుండా కొన్ని ఆహారాలను తీసుకుంటే యవన్నంగా ఉండవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేయటమే కాకుండా చర్మం ముడతలు లేకుండా యవన్నంగా ఉండేలా చేస్తుంది.

పాలకూర

పాలకూరలో ఫైబర్, పొటాషియం, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుండి రక్షించి ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.

-


బీన్స్

బీన్స్ లో ప్రోటీన్స్,పీచు పదార్ధం ఎక్కువగాను,కార్బో హైడ్రేడ్స్ తక్కువగాను ఉండుట వలన శరీర బరువు తగ్గటంలో సహాయపడుతుంది. యాంటీ-ఇంఫ్లేమేటరీ లక్షణాలు ఉండుట వలన ఏజింగ్ లక్షణాలు త్వరగా రాకుండా చేస్తుంది.

పసుపు

పసుపుని ఉత్తమ యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా చెప్పవచ్చు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచి ఏజింగ్ ప్రాసెస్ నిదానంగా జరిగేలా చేస్తుంది.

బాదం పప్పు

ప్రతి రోజు బాదం పప్పును తింటే యవన్నంగా కన్పిస్తారు. బాదం పప్పులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండుట వలన ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.

సాల్మన్

సాల్మన్ లో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండుట వలన ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అంతేకాక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొట్టి వృద్దాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.