మోడీ షాకింగ్ డెసిషన్.. కేంద్ర మంత్రిగా కవిత..?   TRS MP Kavitha To Become Central Minister..?     2018-03-23   03:24:55  IST  Bhanu C

ఈరోజు మిత్రులు రేపటి శత్రువులు..ఈరోజు శత్రువులు రేపటి మిత్రులు…ఏంటి వేదాంతం అనుకుంటున్నారా కాదు కాదు ఇది పచ్చి నిజం అందరికీ తెలిసిన నిజమే అయితే ఈ తరహా నానుడి రాజకీయాల్లో బాగా వర్తిస్తుంది..ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే..తెలంగాణా రాజకీయాల్లోనే కాక ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ వార్త అందరినీ షాక్ కి గురిచేసింది..ఇంతకీ ఏమిటా వార్త అంటే..త్వరలో కేసీఆర్ గారాల పట్టి.. టీఆరెస్ ఎంపీ అయిన కవితకు కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు.. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలని కలవర పెడుతోంది కాంగ్రెస్ నేతలను షాక్ కి గురిచేసింది..వివరాల్లోకి వెళ్తే

తెలంగాణ సీఎం కుమార్తె ఎంపీ కవితకి మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చాడట..కేంద్ర మంత్రి వర్గంలోకి కవితకి తీసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి..మోడీ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటివరకూ టీఆరెస్ కి మంత్రి వర్గంలో చోటులేదు…అంతే కాకుండా టిడిపి ఎంపీలు ఇద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయడం త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణాకు అందులోనూ టీఆర్ఎస్ పార్టీ తరుపున మంత్రి పదవి మంత్రి పదవి ఇవ్వనున్నారు