మోడీ కాచుకో..సవాల్ విసురుతున్న ఏపీ ప్రభుత్వం       2018-06-06   01:53:22  IST  Bhanu C

నిన్నా మొన్నటి వరకూ ఏపీ అంటే చులకన చూపు చూసిన కేంద్రం..తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ సారి ఏపీ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది అంటూ తెలుగుదేశం నేతలు తెగ సంబర పడుతున్నారు.. ఇప్పుడు కేంద్రం జుట్టు ఏపీ చేతిలో ఉంది ఏపీ పై ఒంటి కాలిపై ఎగిరిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు రండి బయటకి అంటూ సవాళ్లు విసురుతున్నారు..అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ కూడా బీజేపి నేతలు స్పందించక పవడం పలు అనుమానాలకి తావిస్తోంది..అసలు కేంద్రం జుట్టు ఏపీ చేతిలో ఉండటం ఏమిటి..? అసలేమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే..

కేంద్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం తాలూకు ఆధారాలు ఏపీ చేతికి చిక్కాయట..అయితే ఈ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడుతామని ఏపీ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది..ఈ ప్రకటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది..బిజెపి నేతలకి గుండెల్లో రైళ్ళు పరిగెట్టడం మొదలయ్యింది..అయితే ఈ స్కాము చాలా భారీ స్థాయిలో ఉందని త్వరలోనే అన్ని ఆధారాలతో సహా బయట పెడుతామని ఏపీ ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు…మీడియాతో మాట్లాడిన సందర్భంలో తెలిపారు..

అంతేకాదు మీడియాతో మాట్లాడిన కుటుంభరావు ఎన్ని సంచలన విషయాలు బయట పెట్టారు..ఏన్డీయే జాతీయ మీడియాని సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయాలు చేస్తోందని అన్నారు..నెలరోజుల వ్యవధిలో కేంద్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని సాక్ష్యాలతో సహా మేము బయట పెట్టడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.. అంతేకాదు నరేంద్ర మోడీ కి దగ్గరగా ఉండే ఒక వ్యాపార సంస్థకు లబ్ది చేకూర్చేలా చేసిన కుంభకోణం వివరాలు ఆన్నీ తమ వద్ద ఉన్నాయని వాటిని అన్ని ఆధారాలతో సహా బయట పెట్టడానికి సిద్దంగా ఉన్నామని సవాల్ విసిరారు.


అయితే కేంద్రంలో జరిగిన ఈ భారీ కుంభకోణం పై ప్రజాప్రయోజన వాజ్యం ఫైల్ చేయబోతున్నాం మీకు ఎదుర్కునే ధైర్యం ఉందా అంటూ మరొక సవాల్ విసిరారు..అయితే ఈ ప్రకటనతో ఒక్క సారిగా కమలనాధులు ఖంగుతిన్నారు…బీజేపీ నేతలు పదేపదే యూసీలు అంటున్నారని, ఆ విషయంలో సమావేశం ఏర్పాటు చేసేందుకు మేము సిద్దమని సవాలు విసిరారు..జీవీఎల్ యూసీల గురించి అడుగుతున్నారు అసలు ఎవరు అతను అంటూ మండిపడ్డారు..ఎయిర్ ఏషియా వ్యవహారానికి నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం తెలిపిందని కుటుంబ రావు గుర్తు చేశారు. అలా అయితే ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎన్డీయేలోని మంత్రులు అందరూ ఈ వ్యవహారంలో ఉన్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు..అయితే ఇప్పుడు కేంద్రంపై ఏపీ చేస్తున్న ఆరోపణలు కానీ కుంభకోణం వ్యవహారం కానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.