మొటిమలు వదిలిన గుంటలు ఇలా పోతాయి. చికిత్స ఖరీదు చవకే  

మొటిమ వచ్చిందంటే అది మొటిమలనే ఉండిపోదు. కొన్ని రోజులు మొటిమలా ఉంటూ సతాయిస్తే, ఆ తర్వాత నల్లని లేదా ఎర్రని మచ్చగా మారుతుంది. సాధారణంగానైతే మన భారతీయుల చర్మం పై నల్లని మచ్చలు వదిలి వెళుతుంది మొటిమ..

-

ఈ మొటిమల వలన వచ్చే మచ్చలే చాలా ఇబ్బందిగా ఉంటే వాటికి తోడుగా వచ్చే గుంటలు అంటే చర్మం పై ఏర్పడే రంధ్రాలు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. చర్మాన్ని చాలా దారుణంగా మార్చేస్తాయి. దాంతో మన మొహం గుంటలు గుంటలు గా ఉంటుంది.

మన అందం అంతా ఆ గుంటలు కప్పేస్తాయి. మొటిమలు వదిలించుకోవాలంటే ఎన్నో మార్గాలున్నాయి. నూనె తక్కువగా వాడే ఆహార పదార్థాలు తింటూ వుంటే ఆయిల్ తక్కువగా ఏర్పడి మొటిమలు తగ్గుముఖం పడతాయి.

ఎన్నో పండ్లు, కూరగాయలు, మొటిమలు రాకుండా సహాయపడతాయి. నల్ల మచ్చలను కూడా నిమ్మకాయ వాడి లేదంటే ఆరెంజు వాడి, మార్కెట్లో దొరికే మెడిసిన్స్ వాడి తగ్గించుకోవచ్చు. కానీ మొటిమల వల్ల వలన ఏర్పడిన రంధ్రాలను పోగొట్టుకునేది ఎలా? వీటి మీద ఎలాంటి పండ్లు, కూరగాయలు, ఎలాంటి ఆహార పదార్థాలు పనిచేయవు.

ఎలాంటి క్రిమ్ వాడిన లాభం లేదు. మరి ఎలా ? దానికి ఒకటే మార్గం, లేజర్ ట్రీట్మెంట్. మన దేశంలో కూడా అందుబాటులో ఉన్న ఈ లేజర్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుందో, దీని వలన ఎలాంటి లాభాలు వస్తాయో, అలాగే ఎలాంటి నష్టాలు వస్తాయి ఇప్పుడు చూద్దాంలేజర్ ట్రీట్మెంట్ లో పలురకాలుగా ఉంటాయి.

‌ భారతీయుల చర్మంపై అన్నీ సరిగా పనిచేయవు. కొన్నీటి వలన side effects ఉంటాయి. అంటే చర్మం యొక్క రంగు కాస్త నల్లబడడం జరగొచ్చు.

అయితే ప్రతి లేజర్ ఇలాంటి నష్టమే తీసుకోరాదు. ఎలాంటి లేజర్ వాడాలో ముందే డాక్టర్ తో చర్చించాలి. లేజర్ ట్రీట్ మెంట్ కి ముందు, ఆ తరువాత ఓ రెండు వారాలపాటు ధూమపానం కాని మద్యపానం కానీ చేయకపోవడమే మంచిది.

అలాగే కొన్నిరకాల మెడిసిన్ తీసుకోరాదు. ఎలాంటివి తీసుకోకూడదో మీరు డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ వలన మొటిమల వలన ఏర్పడిన గుంటలన్నీ పూర్తిగా 100% పోవు. కానీ సాధ్యమైనంతవరకు గుంటలను కవర్ చేస్తారు డాక్టర్లు.

ఎంతలేదన్నా 70 నుంచి 80 శాతం వరకు మార్పు కనబడుతుంది. అంతేతప్ప నూటికి శాతం ప్రతి రంధ్రాన్ని కప్పిపుచ్చడం సాధ్యపడే విషయం కాదు. హైదరాబాద్ లో కి ట్రీట్ మెంట్ ఖర్చు ఒక్కో సెషన్ కి ₹4000 నుంచి ₹8000 పట్టవచ్చు. ఎన్ని సెషన్ల పాటు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది మీ చర్మం పై ఉన్న గుంటలను బట్టి ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ అయిన తరువాత కూడా మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి.

ఉదాహరణకు చెప్పాలంటే సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా వాడాలి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి.