మైనర్ల కి ఎంట్రీ కి యూఏఈ కొత్త రూల్స్       2018-06-03   01:03:40  IST  Bhanu C

తమదేశంలోకి ప్రవేశించే మైనర్ల విషయంలో యూఏఈ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటోంది..ఎన్నో దేశాల నుంచీ ఎంతో మంది వివిధరకాల పనుల నిమిత్తం లేదా పర్యాటక వీక్షణ నిమిత్తం వస్తున్నారు వారిలో అక్రమంగా వచ్చే వాళ్లు ఉంటే మరికొందరిని బలవంతంగా తీసుకు వస్తున్నారు అనే ఆరోపణలు ఉన్న నేపధ్యంలో తమ దేశం యొక్క సంరక్షణలో భాగంగా యూఏఈ మైనర్లు తమ దేశానికి వచ్చే విషయంలో ఒక నిభందన పెట్టింది..అదేంటంటే..

తల్లితండ్రులు వెంటలేకుండా గల్ఫ్ దేశం యూఏఈ వెళ్లాలనుకునే మైనర్లు అంటే 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారి ప్రయాణానికి తల్లితండ్రుల అనుమతి ఉండాల్సిందే. ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన మైనర్లు మాత్రమే యూఏఈలోకి ప్రవేశం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది..అయితే తల్లి తండ్రులతో ప్రయాణం చెయని సమయంలో మాత్రమే ఈ నిభందన వర్తిస్తుందని యూఏఈ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..

యూఏఈ జనరల్ డైరెక్టరేట్ అఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ ఆఫైర్స్-దుబాయ్ ఈ ప్రకటన విడుదల చేసిందని ఎయిరిండియా వెల్లడించింది…అయితే ఈ నిభందన జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు మైనర్ ఎవరైనా సరే ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న సముయంలో కూడా ఈ నిభందన వర్తిస్తుందని తెలిపింది..