మెగా హీరోకు మరో ఫ్లాప్‌ తప్పేలా లేదు  

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు రెండు మూడు సక్సెస్‌లను మాత్రమే దక్కించుకున్నాడు. ఈయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ ముందు అట్టర్‌ ఫ్లాప్‌గా నిలుస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి...

మెగా హీరోకు మరో ఫ్లాప్‌ తప్పేలా లేదు-

ఈయన చేసిన వరుస చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్న కారణంగా తాజాగా చేస్తున్న సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు. కరుణాకరన్‌ దర్శకత్వంలో ‘తేజ్‌’ చిత్రంలో ప్రస్తుతం ఈ మెగా హీరో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు రంగం సిద్దం అవుతుంది.

తేజ్‌ చిత్రంపై సినీ వర్గాల వారిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకప్పుడు కరుణాకరన్‌ దర్శకత్వంలో సినిమా అంటే ఖచ్చితంగా సక్సెస్‌ అనుకునేవారు. కాని ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో సినిమాలు ఇటీవ ఏ ఒక్కటి సక్సెస్‌ కాలేదు. దాంతో ఈ చిత్రంపై కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. భారీ ఎత్తున ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నప్పటికి సినిమా వర్గాల్లో అంచనాలను కలిగించడంలో దర్శకుడు విఫలం అవుతున్నాడు. ఈ చిత్రంలో తేజ్‌ రాక్‌స్టార్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది...

ఇలాంటి పాత్రలు చేయాలంటే కాస్త స్టైలిష్‌గా కనిపించాలి. కాని తేజూ మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా ఉంటాడు.
ఇటీవల విడుదలైన పోస్టర్‌లో తేజ్‌ లుక్‌ అంతగా ఆకట్టుకోలేక పోయింది.

కారణం ఇన్నాళ్లు మాస్‌ పాత్రలు పోషించిన ఈయన ఇప్పుడు ఇలా కనిపించడంతో అంతా కూడా కొత్తగా చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఇంటిలిజెంట్‌ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో తేజూపై చాలా ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా ఒక సక్సెస్‌ దక్కించుకుంటే తప్ప ఆయన ఇమేజ్‌ను కాపాడుకోలేడు.

అందుకే తేజూ ఈ చిత్రం సక్సెస్‌ కోసం తెగ తాపత్రయ పడుతున్నాడు. కాని ఈ చిత్రం మాత్రం ఆయనకు పెద్దగా సక్సెస్‌ను తెచ్చి పెట్టేలా కనిపించడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తేజ్‌ చిత్రం ఫ్లాప్‌ అయితే ఆ సినిమా అయినా ఈ మెగా హీరోకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి. సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ మెగా హీరో సాయి ధరమ్‌తేజ్‌ తన సినిమాల సంఖ్యను పెంచుకుంటున్నాడు.

కాని ఈయన సక్సెస్‌ల రేషియో మాత్రం దారుణంగా పడిపోతూనే ఉంది.