మూడేళ్ళు ప్రేమించి చివరికి ఉరేసుకోమని చున్ని ఇచ్చింది.! అసలేమైందో తెలుసా.?       2018-05-22   01:25:06  IST  Raghu V

సూసైడ్ చేసుకోవాలనుకునే వారికి చెప్పేది ఒక్కటే. జీవితం చాలా విలువైంది. అంత సులువుగా నీ అంతట నువ్వు అంతం చేసుకోవద్దు. జీవితంతో ఎదురు ఈది పోరడు. నీ వాళ్ళ కోసం బతుకు, నలుగురిని బతికించు. పిరికివారికి లోకంలో చోటు లేదు. కానీ నీకు చచ్చే అంత దైర్యం ఉంది అంటే సమస్యని ఎదురుకునే ధైర్యం ఉన్నట్టే. మరి చావడం ఎందుకు? అయినా ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవడం ఏంటి? లవ్ కంటే లైఫ్ చాలా గొప్పది. ఏదో ఒక రోజు లైఫ్ నీకు నచ్చినట్టు మారుతుంది. ఒక అమ్మాయి కోసం నీవాళ్లకి దూరం అవ్వడం కరెక్ట్ కాదు.” ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.

ల‌వ‌ర్ మోసం చేసింద‌ని…ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి, రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌రేష్ గురించి అంద‌రికీ తెలిసిందే…ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేకం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ…న‌రేష్ ఇష్యూ మాత్రం చాలా వైర‌ల్ అయ్యింది, దానికి కార‌ణం అత‌ను త‌న మ‌ర‌ణానికి ముందు త‌న ల‌వ‌ర్ కు సంబంధించిన డీటైల్డ్ స‌మాచారం ఫోటోస్ తో స‌హా…ఫేస్ బుక్ లోని త‌న అకౌంట్ లో పోస్ట్ చేయడం. అయితే ఇప్పుడు అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

మూడు సంవత్సరాల ప్రేమ ముగ్గురు వ్యక్తుల కారణంగా ముగిసిపోయింది. నేనే లోకం అన్నది,నేను లేకపోతేేె చచ్చిపోతాను అని అనలేదు.నన్ను చచ్చిపోమని తన చున్నీ ఇచ్చిన వీర వనిత.చిత్రంగ ఉంది కదా.బలం,బలగం అన్నీ ఉన్న నేను నా మరదలు రమ్య,నా మావయ్య తిరుమనాదం శ్రీను,రమ్య వాళ్ళ మావయ్య సుంకర రామకృష్ణ ల ముగ్గురు వ్యక్తుల కారణం గా చచ్చిపోవడానికి నిశ్చయించుకొని ఈ సూసైడ్‌ నోట్‌ రాస్తున్నాను. అమ్మ,అక్క,అన్నయ్య నన్ను క్షమించండి.