మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?       2018-06-25   04:11:40  IST  Raghu V

11 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 11 వ సంఖ్యకు అధిపతి చంద్రుడు. వీరి మీద చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి కాస్త ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి కోపం,ఆవేశం వచ్చిన తొందరగానే తగ్గిపోతాయి. అయినా సరే కోపం,ఆవేశం వచ్చినప్పుడు సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం చాల ముఖ్యం. ఎందుకంటే కోపంలో తీసుకొనే నిర్ణయాల కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వీరు ఏ రంగంలో ఉన్న సరే అదృష్టం ఒక్కసారిగా వచ్చి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళుతుంది. వీరికి అదృష్టం అనేది యుక్త వయస్సు దాటినా తర్వాత వస్తుంది. వీరు ఎంత తొందరగా ఉన్నత స్థితికి వెళతారో అంతే తొందరగా కిందికి దిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

వీరికి ఆవేశం,కోపం అనేది మైనస్ అనే చెప్పాలి. ఇవి వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వీరిలో స్వార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసిన ఏదైనా లాభం ఉంటేనే ముందుకు అడుగు వేస్తారు. ఈ విషయంలో అసలు మొహమాటం పడరు.

వీరికి హడావిడి,గందరగోళం సృష్టించటం కూడా చాలా ఎక్కువే. వీరు జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసిన సరే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి పెద్ద బలహీనతలు కోపం,ఆవేశం. వీటిని తగ్గించుకుంటే జీవితంలో చాలా ఉన్నతస్థితికి చేరుకుంటారు.