మీకు బైక్‌ ఉందా..? అయితే కొద్ది రోజులు జాగ్రత్త..! లేదంటే కష్టాలు తప్పవు.!       2018-06-07   03:08:00  IST  Raghu V

ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై బైక్ నడపడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఒకపక్క పెరిగిన పెట్రోల్ ధరలు, మరో పక్క చితులైన రోడ్లు. వాహనదారులకు నరకాన్ని లైవ్ లో చూపిస్తున్నాయి. చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు, అడుగడుగునా గోతులతో అధ్వానస్థితికి చేరిన రహదారులు. ఇదీ వర్షాకాలంలో కనిపించే పరిస్థితి. ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలంటే ద్విచక్రవాహనదారుల పరిస్థితి మరీ దయనీయం. ప్రయాణం మాటెలా ఉన్నా గోతులతో ద్విచక్రవాహన దారుల ఇబ్బంది అంతా ఇంతా కాదు.

వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మన బైక్ ను ఇంట్లోకంటే మెకానిక్ షెడ్ లో ఎక్కువ ఉంచాల్సి వస్తుంది. కాబట్టి వాహన దారులు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

1. ముందుగా ఇంజిన్. ఏ మోటారు వాహనానికైనా ఇంజన్‌ హార్ట్ లాంటిది. వర్షాలతో డ్లపై నీరు నిలిచినప్పుడు కాస్త ఆలోచించి నడపాలి. సైలెన్సర్‌లో నీరు పోతే అది నేరుగా ఇంజన్‌కు చేరుతుంది. వెంటనే దాని ప్రభావం చూపకున్నా రెండు రోజుల తరువాత శబ్ధం మొదలై పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది.

2. వర్షాలకు త్వరగా దెబ్బతినే విడిభాగం సైలెన్సర్‌ అని మెకానిక్‌లు చెబుతున్నారు. నికెల్‌ కోటింగ్‌తో ఉండే సైలెన్సర్‌కు మట్టి, బురద అంటితే… ఆ కోటింగ్‌ పోతుంది. వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లగానే సైలెన్సర్‌కు పట్టిన మట్టిని తుడిచివేయాలి. బురద అలాగే పట్టుకుంటే…. సైలెనర్స్‌కు రంధ్రాలు పడతాయి.

3. వర్షం కారణంగా వీల్స్‌ బేరింగ్‌లో నీరు చేరే ప్రమాదం ఉంది. నీళ్లు ఆరిపోయాక బేరింగ్‌లో ఆయిల్‌ పోయడం మంచిది. గతుకుల రోడ్లపై వేగంగా వెళితే ఈ బేరింగ్‌లోని బాల్స్‌ దెబ్బతింటాయి.

4. చైన్‌ పాకెట్‌ కవర్‌ ఉన్నా లోనికి నీరు చేరే ప్రమాదముంది. దీంతో శబ్ధం వస్తుంది. వెంటనే గ్రీజు వేయాలి. దీన్ని ఉపేక్షిస్తే చైన్‌ వదులుగా మారి, ఆపై చెడిపోతుంది.

-

5. మడ్‌గార్డులకు బురద అంటితే అప్పటికి ఏ మాత్రం నష్టం ఉండదు. ఎక్కువకాలం వాటర్‌ సర్వీసింగ్‌ చేయించకుండా, ఆ బురదను అలాగే అంటిపెట్టుకుని ఉంటే… ఫైబర్‌ మడ్‌గార్డు ఆయినా నికెల్‌ కోటింగ్‌ ఉన్న ఉక్కు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ అయినా దెబ్బతింటాయి.

6. వర్షం జోరందుకుంటే పెట్రోల్‌ ట్యాంక్‌ పకడ్బందీగా మూత ఉన్నా… నీరు లోనికి పోతుంది. అంతేగాక పెట్రోల్‌తో సహా నీరు కార్బొరేటర్‌లోకి చేరుతుంది. వెంటనే వాహనం మొరాయిస్తుంది.

7. గాలిని చెక్‌ చేయించుకోవాలి

8. వర్షం నీరు కారణంగా బ్రేకులు, కిక్‌రాడ్లు, క్లచ్‌, గేర్లు జామ్‌ అయ్యే ప్రమాదం ఉంది