“ఆంగ్లో” ఇండియన్ “దారుణ హత్య”       2018-05-19   07:03:07  IST  Bhanu C

భారతీయులపై విదేశాలలో దాడులు జరగడం పరిపాటి అయ్యింది..అమెరికాలో జాత్యహంకార దాడులు జరుగున్న సమయంలో అన్ని దేశాలు ముఖ్తఖంటంతో ఖండించాయి..ఆ తరువాత మళ్ళీ ఎటువంటి దాడులు జరిగిన దాఖలాలు లేవు అయితే తాజాగా ఉత్తర ఇంగ్లాండ్ లో జరిగిన ఒక ఘటన మళ్ళీ భారత ఎన్నారై లలో ఆందోళన కలిగిస్తోంది..వివరాలలోకి వెళ్తే..

భారత సంతతికి చెందిన మహిళా ఫార్మాసిస్టును గుర్తు తెలియని దుండగుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు…గత కొంతకాలంగా జెస్సికా ని ఫాలో అవుతున్న ఒక గుర్తు తెలియని వ్యక్తీ..ఇంగ్లండ్‌లోని మిడిల్స్‌బరో పట్టణంలోని తన ఇంట్లో ఉన్న జెస్సీకా పటేల్‌ గత సోమవారం వెంటాడి వెంటాడి హత్య చేసినట్లుగా పోలీసుల కధనంలో తెలిపారు.

అయితే జేస్సికాని చంపిన హంతకుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లుగా తెలిపారు..తెలిపారు. ఇదిలాఉంటే మిడిల్స్‌బరోలో జెస్సీకా, మితేష్‌ లు యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో చదువుతున్న సమయంలో ఇరువురూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు..వివాహం అనంతరం ఇరువురు ఫార్మసీని ఏర్పాటు చేసుకుని మూడేళ్ళుగా నడుపుతున్నారు..

అయితే ఆమె మృతిపై ఇప్పటికిప్పుడు కారణాలని తెలుపలేమని ఈ సంఘటనపై ఎటువంటి సమాచారం ఉన్నా సరే మాకు వివరాలు అందించాలని పోలీసులు స్థానికులకి తెలియచేశారు..జెస్సీకా నివాసం ఉండే భవనం రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుందని, ఆధారాలను కూడా సేకరించలేని విధంగా ఈ కేసు ఉందని..త్వరలో ఈ కేసు చిక్కు ముడిని వీడుతుందని తెలిపారు..