మిత్ర ధర్మానికి వెన్నుపోటు బహుమానమా..? గర్జించిన లోకేష్.       2018-05-23   00:58:35  IST  Bhanu C

తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసిన సమయంలో ఏపీ నేతలకంటే ముఖ్యంగా కేంద్రంలో అధికారం కోసం తెలుగు వారి ఓట్ల కోసం వెంపర్లాడుతున్న బీజేపి గట్టిగానే తన గొంతుని వినిపించింది..కానీ ఇప్పుడు పాలన చేతికి వచ్చాక ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వడం మానేసి ఆ హామీని చట్టపరంగా వచ్చే హక్కులని ఏపీ కి రాకుండా చేస్తూ తెలుగు ప్రజలని హింసలకి గురిచేస్తోంది.

ఈ పరిణామాలతో ఇప్పుడు ఏపిలో సామాన్య ప్రజలే కాదు..రాజకీయ నేతలు కూడా తీవ్రమైన ఆవేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ పార్లమెంట్ లో ఏరకమైన నిరసన తెలిపిందో అందరికీ తెలిసినదే అయితే ఈ విషయంపైనే చంద్రబాబు విజయవాడలో నిరాహార దీక్ష కూడా చేశారు. తిరుపతిలో కేంద్రానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం సభ నిర్వహించారు..అయితే వరుసగా తెలుగు దేశం పార్టీ ధర్మ పోరాట దీక్షలని చేస్తున్న విషయం తెలిసిందే…అయితే ఈ నేపధ్యంలో విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన ధర్మ పోరాట సభ నిర్వహించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా ఐటీ శాఖా మంత్రి నారా “లోకేష్” కేంద్రంపై తీవ్రంగా స్పందిచారు..లోకేష్ ఈ రేంజ్ లో కేంద్రంపై ఫైర్ అవ్వడం ఇదే మొదటి సారిగా చెప్పవచ్చు..రాష్ట్రం విభజన మనం కోరుకున్నది కాదని, విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారన్నారు.

కానీ గడిచిన నాలుగేళ్ళు ఎంతో ఓపిక పట్టాం. మొదటి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామని, రెండో ఏడాది ఇదిగో ఇస్తున్నాం అని, మూడో ఏడాది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని, చివరిగా నాలుగో ఏడాది మనరాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచారు..విభజన వాళ్ళ ఏపీ లో లోటు బడ్జెట్ ఉందని, అయినప్పటికీ అనింటినీ అధిగమించి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని అయితే కేంద్రం చంద్రబాబు ని ఏపీ ప్రజల ముందు దోషిని చేయడానికి వైసీపి ,జనసేనతో కలిసి నాటకాలు ఆడుతోందని అంటూ ఫైర్ అయ్యారు..తెలుగు ప్రజల సత్తా ఏమిటో రాబోయే ఎన్నికల్లో తప్పకుండా చూపించాలని అందుకు తెలుగు వారు అందరూ సన్నద్ధం కావాలని పిలుపు ఇచ్చారు నారా లోకేష్..లోకేష్ మాట్లాడిన తీరు చేసిన ప్రసంగం ఎంతో ఉద్వేగభరితంగా సాగి టీడీపీ నేతల్లో ఫుల్ జోష్ ని నింపింది.