మహేష్, ఎన్టీఆర్ .. ఇద్దరినీ దారుణంగా ఓడించిన పవన్     2017-09-14   00:40:48  IST  Raghu V

-

-

తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా బాహుబలి అనే చెప్పాలి. తెలుగు మార్కెట్ ని రెండు భాగాలుగా విభజించాలి అంటే బాహుబలికి ముందు, బాహుబలి తరువాత అనే విభిజన చేయాల్సిందే. అంతలా బాహుబలి ప్రభావం తెలుగు ట్రేడ్ పై పడింది. ఇప్పుడు వంద కోట్ల బిజినెస్ అనేది సర్వసాధారణ విషయం అయిపొయింది. శాటిలైట్ హక్కులు కూడా కలపకుండా స్పైడర్, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాలు వంద కోట్ల బిజినెస్ మార్కుని దాటడం విశేషం.

నాన్ బాహుబలి రికార్డు సెట్ చేసాడని మహేష్ బాబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు కాని, అతి త్వరలో ఆ రికార్డుని ఈజీగా దాటేయనున్నాడు పవర్ స్టార్. అది కూడా ఒక్క తెలుగు వెర్షన్ తోనే. స్పైడర్ లెక్కలే దిమ్మదిరిగేలా ఉంటే, దానికి మించిన ఆఫర్లు రాబడుతోంది పవన్ సినిమా. ఓవర్సీస్ మినిహా, ఇప్పటివరకు బిజినెస్ జరిగిన ప్రతీ ఏరియాలో స్పైడర్ ని పెద్ద తేడాతో కొట్టేసింది ఈ చిత్రం. స్పైడర్ మాదిరే ఈ సినిమా బిజినెస్ కూడా మొత్తం మీద 160 కోట్లు దాటేయనుంది.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల హిట్ కాంబినేషన్ చాలా ప్లస్ అయ్యింది. మరి మహేష్ బాబు తదుపరి సినిమా కొరటాల శివతో. ఈ ఇద్దరు ఇంతకుముందు శ్రీమంతుడు లాంటి రికార్డు బ్లాక్బస్టర్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమాపై కూడా భారి అంచనాలు ఉంటాయి. మరి పవన్ రికార్డులని మళ్ళీ మహేష్ కొడతాడా లేదా చూడాలి.