మహేష్‌ బాబుతో గీత గోవిందం దర్శకుడు... మెగా హీరో కోసం అనుకున్న కథతో సూపర్‌ స్టార్‌  

Director Parasuram With Mahesh Babu-geetha Govindam,movie Updates,parasuram,మహేష్‌ బాబు,మెగా హీరో కోసం అనుకున్న కథతో సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరో మూడు వారాల్లో మహేష్‌బాబు మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేయబోతున్న సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక మహేష్‌ బాబు తాజాగా గీతా ఆర్ట్స్‌లో ఒక చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు..

మహేష్‌ బాబుతో గీత గోవిందం దర్శకుడు... మెగా హీరో కోసం అనుకున్న కథతో సూపర్‌ స్టార్‌-Director Parasuram With Mahesh Babu

కొన్ని రోజుల క్రితం మహేష్‌ బాబు ఇంటికి స్వయంగా అల్లు అరవింద్‌ వెళ్లి మరీ నమ్రతతో మాట్లాడి మహేష్‌బాబు డేట్లు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మహేష్‌బాబుతో అల్లు అరవింద్‌ నిర్మించబోతున్న సినిమాకు దర్శకుడు ఎవరై ఉంటారు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎట్టకేలకు ఆ విషయమై క్లారిటీ వచ్చింది.

‘గీతా గోవిందం’ చిత్ర దర్శకుడు పరుశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు మూవీని అల్లు అరవింద్‌ నిర్మించబోతున్నాడట. గీతా గోవిందం వంటి సంచలన చిత్రంతో రికార్డులు బ్రేక్‌ చేసి, విజయ్‌ దేవరకొండను సూపర్‌ స్టార్‌ చేసిన దర్శకుడు పరుశురామ్‌. అందుకే ఆయన దర్శకత్వంలో నటించేందుకు మహేష్‌బాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గీత గోవిందం విడుదలైన వెంటనే గీతాఆర్ట్స్‌ 2లో మెగా హీరోతో పరుశురామ్‌ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అందుకోసం కథను కూడా సిద్దం చేసిన పరుశురామ్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆ కథ మహేష్‌బాబుకు అయితే బాగుంటుందని అల్లు అరవింద్‌ భావించాడట.

దాంతో అదే కథను తీసుకు వెళ్లి నమ్రత, మహేష్‌లకు చెప్పగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అయితే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత తుది నిర్ణయం చెబుతానంటూ తెలిపినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చడంతో స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని పరుశురామ్‌ చేస్తున్నాడు..

అందుకే తప్పకుండా ఈ చిత్రం వర్కౌట్‌ అయ్యేలా ఉందని మెగా కాంపౌండ్‌లో ప్రచారం జరుగుతోంది.