మహానటి : అది కాదన్న ఎన్టీఆర్‌ ఇది ఓకే అన్నాడు  

  • మహానటి చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎంపిక చేయలని దర్శకుడు భావించాడు. కాని ఎన్టీఆర్‌ మాత్రం అందుకు సన్నితంగా తిరష్కరించాడు. తాత పాత్రను తాను చేయలేను అని చెప్పడంతో అందుకు ప్రత్యామ్నాయంగా దర్శకుడు మరో దారిలో ఎన్టీఆర్‌ పాత్రను తెరకెక్కించడం జరిగింది. ఎన్టీఆర్‌ పాత్రకు నో చెప్పిన ఎన్టీఆర్‌ తాజాగా చిత్ర ప్రమోషన్‌ కోసం హెల్ప్‌ చేసేందుకు ముందుకు వచ్చాడు. నేడు విడుదల కాబోతున్న ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు.

  • -

  • ఏయన్నార్‌ పాత్రలో నాగచైతన్య నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ పాత్ర కోసం నాగచైతన్య దాదాపు వారం రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తే బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం ఏదో కారణం చెప్పి సినిమాకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మహానటి చిత్రం కోసం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం, ఆయన నటించేందుకు నో చెప్పినా వెంటనే ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.‘మహానటి’ ఆడియో వేడుకలో ఎన్టీఆర్‌ పాల్గొనడం ఖచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించింది. సమంత కీలకమైన జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాష్‌ రాజ్‌ ఇంకా పలువురు ముఖ్య తారాగణం ఈ చిత్రంలో నటించడం జరిగింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

  • ప్రస్తుతం ఎన్టీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న త్రివిక్రమ్‌ మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. ఎన్టీఆర్‌ బిజీ షెడ్యూల్‌లో కూడా మహానటి చిత్రం ప్రమోషన్‌ కోసం వచ్చేందుకు ఓకే చెప్పాడు. మహానటిపై తొగు సినిమా పరిశ్రమ అందరికి ఎంతో గౌరవం ఆ కారణంగానే ఎన్టీఆర్‌ కూడా ఈ చిత్రం ఆడియో విడుదలకు వచ్చాడు.