“మలేసీయా” లో మంత్రిగా భారత “సిక్కు ఎన్నారై”       2018-05-23   00:49:37  IST  Bhanu C

మలేసియాలో భారత సంతతికి చెందిన ఒక సిక్కు ఎన్నారై రికార్డు సృష్టించాడు..మలేషియాలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎన్నారై మలేసియా ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచాడు..అయితే భారత సంతతి సిక్కు వ్యక్తి ఆ రికార్డు ని క్రియేట్ చేయడం అక్కడ సర్వత్రా చర్చనీయంసం అయ్యింది అంతేకాదు భారతీయలు అందరికీ గర్వకారణంగా నిలిచింది వివరాలలోకి వెళ్తే..

మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్‌ దేవ్‌ రికార్డులకి ఎక్కారు పక్కాటన్ హరప్పన్ సంకీర్ణ మంత్రివర్గంలో గోవింద్‌సింగ్‌ దేవ్ సమాచార, మల్టీమీడియా శాఖ మంత్రిగా నియమితులైయారు..అంతేకాదు ఆయనతో పాటు మరో భారత సంతతికి చెందిన ఎం.కిలసేగరన్‌ మానవ వనరులశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు.

గోవింద్‌సింగ్‌ దేవ్ మలేసియాలోని పుచుంగ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్నారు. గోవింద్‌ తండ్రి కర్పాల్‌ సింగ్‌ మలేసియాలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త ఎంతో పేరు ఉన్న వ్యక్తి కూడా అంతేకాదు..అయితే గోవింద్ పార్లమెంటు అభ్యర్దిగా ఎన్నిక కావడం ఇది కొత్త కాదు గోవింద్‌సింగ్‌ 2008లో మొదటిసారి మలేసియా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

అయితే ఆ తరువాత వరుసగా 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేశారు. గోవింద్‌సింగ్‌ దేవ్‌కు మంత్రి వర్గంలో చోటు లభించడంతో సిక్కు సామాజిక వర్గం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి…అయితే మలేషియాలో లక్షల సంఖ్యలో సిక్కులు ఉండటం కూడా గోవింద్ దేవ్ కి ఎంతో కలిసి వచ్చిందని అంటున్నారు..