మరో బిజినెస్‌మన్‌ను బుట్టలో పడేసింది       2018-05-18   01:52:20  IST  Raghu V

ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయినా కూడా కొన్నాళ్లకు క్రేజ్‌ తగ్గి పోతుందనే విషయం అందరికి తెల్సిందే. ఈరోజు స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న వారు మరో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అవకాశాలే లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు త్రిష పరిస్థితి అలాగే ఉంది. దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకున్న ముద్దుగుమ్మ త్రిష ఎట్టకేకు సినిమాలకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది.

త్రిష వివాహం గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మీడియాలో వచ్చిన పుకార్లతో ఒక పుస్తకమే వేయవచ్చు అంటే అతిశయోక్తి లేదేమో. ఎన్నో సార్లు అదుగో ఇదుగో త్రిష పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కొన్నాళ్ల క్రితం రాహుల్‌తో త్రిష వివాహ నిశ్చితార్థం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆయన నుండి విడిపోయింది. సినిమాలకు దూరంగా ఉండాలనే కండీషన్‌ ఆయన పెట్టడం వల్లే త్రిష అతడినే వదిలేసినట్లుగా సమాచారం అందుతుంది. రాహుల్‌ నుండి విడిపోయాక ఒకటి రెండు సంవత్సరాలు సినిమాల్లో బిజీగా గడిపిన త్రిష ఈమద్య కాలంలో అవకాశాలు లేక ఢీలా పడిపోయింది.

సినిమాల్లో అవకాశాలు లేని త్రిష ఇక చేసేది లేక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఇప్పటికే ఒక బిజినెస్‌మెన్‌ను బుట్టలో పడేసినట్లుగా సమాచారం అందుతుంది. చెన్నైకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుతో ఈమె ప్రేమాయనం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమద్యే తండ్రి బిజినెస్‌లను టేకోవర్‌ చేసిన ఆ వ్యక్తి త్రిష అంటే పడి చస్తున్నాడట. దాంతో త్రిష కూడా ఆయనకు మనసు ఇచ్చేసిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరు అన్నింటిని షేర్‌ చేసుకుని జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఈ సంవత్సరంలో అధికారికంగా వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు. త్రిష గతంలో ఒక బిజినెస్‌ మన్‌తో వివాహం నిశ్చితార్థం జరిగింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. తాజాగా మరోసారి ఆమె వివాహ నిశ్చితార్థంకు రంగం సిద్దం అయ్యింది. రెండు నెలల్లో నిశ్చితార్థం చేసుకుని ఈ సంవత్సరం చివర్లో ఆయన్ను వివాహం చేసుకోవాలని త్రిష భావిస్తుంది. అతి త్వరలోనే త్రిష కుటుంబ సభ్యులు మరియు ఆ బిజినెస్‌ మన్‌ కుటుంబ సభ్యులు కలిసి సంయుక్తంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.