మరోసారి ఫేస్బుక్ లైవ్ లో శ్రీరెడ్డి..! కామెంట్ చేసిన వారిని ఎలా బూతులు తిట్టిందో చూడండి.!     2018-05-22   11:48:10  IST  Raghu V

శ్రీరెడ్డి ఇప్పుడు ఈ పేరు టాలివుడ్లో ఒక సంచలనం..తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలి,ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందంటూ మొదట వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి పోరాటం అంచెలంచెలుగా పెరిగింది..ఇండస్ట్రీలో రోజుకొకరి గురించి లీక్ చేస్తు ఇప్పటికే కొందరు డైరెక్టర్లు,నిర్మాతలు,హీరోల పేర్లను బయటపెట్టింది.అర్దనగ్న ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఇదే క్రమంలో శ్రీరెడ్డి పోరాటానికి మద్దతు పెరుగుతుంది..

-

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పుతున్న శ్రీరెడ్డిని మీడియా పక్కన పెట్టేయడంతో ఇక లాభం లేదనుకుని మంగళవారం నాడు ఫేస్‌బుల్ లైవ్‌లోకి వచ్చింది. ప్పటిలాగే లైవ్‌లో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై అంతెత్తున్న లేచింది. వాళ్ల కామెంట్స్‌కు ధీటుగా నోటికి పనిచెబుతూ.. బూతుపురాణం మొదలు పెట్టింది. తనను పొగిడే వాళ్లపై అమితమైన ప్రేమను కురిపిస్తూనే.. తిట్టేవాళ్లను చెడుగుడు ఆడేసింది. ఈ సందర్భంలోనే మహిళలపైనా పలు వివాదాస్పద కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

నా ఉద్యమం ఆగలేదు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చా.. దైవదర్శనం వల్ల నాలో మరింత పవర్ పెరిగింది. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే.. వారికి లం*** అని ముద్రవేస్తున్నారు. కాల్ గర్ల్ అంటూ నోటికొచ్చినట్లు వాగుతున్నారు. అయితే బయటకు కనిపించేది మేమే.. ఎంత మంది ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు లేరు. అలాంటి పరిస్థితులు రావడానికి కారణం కామంతో కళ్లు మూసుకుపోయే మీలాంటి వాళ్లు కాదా? మీరు మాత్రం ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు. ఆడవాళ్లు మాత్రం పతీవ్రతల్లేనే ఉండాలి. ఈ రోజుల్లో పతీవ్రతల్ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీ లాంటి ఎదవల వల్లే పతీవ్రతలు అనే వాళ్లు కనుమరుగు అవుతున్నారు. మీరు చూసే కామపు చూపుల వల్లే అమ్మయిలు పతీవ్రతలు కాలేకపోతున్నారు.

-

నా లైఫ్ గురించి ఒకటే నిర్ణయం తీసుకున్నా.. నాకు ఆఫర్స్ రావాలని నేను రోడ్డు మీదకు రాలేదు. నా లాంటి తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది. దానిపైనే నా పోరాటం. నాకు పాపులారిటీ అవసరం లేదు. నా జీవితం ఏమైపోయినా పర్లేదు అందుకే బయటకు వచ్చా.

-

ఒక్కడ్ని మాత్రమే దేవుళ్లుగా భావించేవాళ్లకు మిగతా వాళ్లందరూ దెయ్యాలుగా కనిపిస్తారు. ఆ దేవుడ్ని ఏమైనా అంటే తట్టుకోలేరు. ఒక మాటతో నా ప్రొటస్ట్ పోయింది అంటున్నారు. మీడియా కవర్ చేయపోతే ఏంటి? నా బాధ ఇంకా రగులుతూనే ఉంది. స్టేట్ మీడియా రాకపోతే.. నేషనల్ మీడియా వస్తుంది. ఇంటర్నేషల్ మీడియా వస్తుంది. తెలంగాణ ఉద్యమానికి మీడియా కవరేజ్ ఇవ్వలేదు. తెలంగాణ రాలేదా? ఇదీ అంతే. కవరేజ్ రాకపోతే ఏంటి? పవన్‌ని ప్రశ్నించినందుకే నా ఉద్యమం ఆగిపోయిందని అబద్ధ ప్రచారం చేస్తున్నారు.