మన హిందూ సంప్రదాయంలో యజ్ఞోపవీతమునకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?  

  • యజ్ఞోపవీతము బ్రహ్మ తత్వమును సూచించుటచే బ్రహ్మ సూత్రమనే పేరు వచ్చింది. వేదాలలోని మూడు సూత్రములను గ్రహించిన బ్రహ్మ వాటిని ఒక సూత్రంగా తయారుచేశాడు. విష్ణువు ఆ సూత్రమును రెట్టింపు చేయగా, శివుడు దానిని గాయత్రిచే అభిమంత్రించి బ్రహ్మ గ్రంధి చేశాడు. త్రిమూర్తుల కారణంగా 9 పోగుల యజ్ఞోపవీతం తయారు చేయబడింది.అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది.

  • యజ్ఞోపవీతంలో ఉండే ఈ తొమ్మిది పోగులలో బ్రహ్మ … అగ్ని … అనంతుడు … చంద్రుడు … పితృదేవతలు … ప్రజాపతి … వాయువు … సూర్యుడు … సర్వదేవతలు నివసిస్తుంటారు. అయితే బ్రహ్మచారులు ధరించే యజ్ఞోపవీతమునకు పెళ్లి అయిన వారు ధరించే యజ్ఞోపవీతమునకు తేడా ఉంటుంది. అలాగే శైవులు … వైష్ణవులు ధరించే యజ్ఞోపవీతంలోను కొన్ని తేడాలు ఉంటాయి.

  • ఇంకా యజ్ఞోపవీతం విషయానికి వస్తే నాభికి తక్కువ ఎక్కువ కాకుండా సమానంగా ఉంటుంది. యజ్ఞోపవీతం ధరించిన వారు పితృ … గురు రుణాలను తీర్చుకొనే అవకాశాన్ని కలిగి ఉంటారు. యజ్ఞోపవీతం ధరించినవారు ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపాలని పురాణాలు చెపుతున్నాయి.