మన టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటారో చూడండి..       2018-05-29   06:55:52  IST  Raghu V

తెలుగు ప్రజలు సినిమా హీరోలని ఎంతగా అభిమానిస్తారో అందరికి తెలిసిందే , వారి అభిమాన నటుడి సినిమా అంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది.బాలీవుడ్ మార్కెట్ కి ధీటుగా తెలుగు సినిమాలకి కలెక్షన్స్ వస్తున్నాయి.బాహుబలి సినిమా తరువాత తెలుగు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు సినిమాలు ఇతర భాషలకు తక్కువ అనువాదామవుతు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది , ఇతర సినీ పరిశ్రమలు మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి..పైగా తెలుగు నుండి హిందీ లోకి డబ్ అవుతున్న సినిమాలకి యూట్యూబ్ లో మంచి వ్యాపారం అవుతుంది. ఒకప్పుడు 50 కోట్ల వసూళ్లు అంటే అదొక సంచలనం కానీ ఇప్పుడు విడుదలయిన మొదటి వారం లొనే 100 కోట్లకు పైగా కలెక్షన్ లు సాధిస్తున్నాయి.తెలుగు సినిమా మార్కెట్ కి తగ్గట్టుగానే తెలుగు నటులు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నిర్మాతలు కూడా ఆ హీరో యొక్క మార్కెట్ ని బట్టి ఇస్తున్నారు..ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో చూద్దాం..

మహేష్ బాబు

బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయి.. తండ్రి బాటలోనే హీరో అయ్యాడు మహేశ్‌బాబు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవల తన రెండు సినిమాలు (బ్రహ్మోత్సవం, స్పైడర్‌) పరాజయం పాలవ్వడం నిరాశ కలిగించిందని ఆయన ఓపెన్‌గానే చెప్పారు. ఆయన తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’ మొదటిరోజు నుంచి సూపర్‌హిట్‌ టాక్ తెచ్చుకొని భారీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయన సినిమాకు రూ. 18-20 కోట్ల వరకు తీసుకుంటారు.

జూనియర్ ఎన్టీఆర్

గడిచిన కొన్నాళ్లుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు వరుసగా సూపర్‌హిట్‌ అవుతున్నాయి. టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జైలవకుశ సినిమాలు ఆయనకు విజయాలు అందించాయి. ఇవి కమర్షియల్‌ సినిమాలు అయినప్పటికీ సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారాయన. ప్రస్తుతం ఆయన రూ. 18 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళితో సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్‌ తన రెమ్యూనరేషన్‌ను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు.

-

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు , ఆయన సినిమా వస్తుందంటే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ లు వస్తాయి , అదే హిట్ టాక్ వస్తే ఇంకా కలెక్షన్ ల సునామీ నే వస్తుంది..ఏ మధ్య ఆయన చేసిన ఆజ్ఞతవాసి ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది.ఆయన సినిమా కి 20 కోట్ల పైనే తీసుకుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటించడం లేదు.ఇప్పుడున్న పరిస్తుతుల్లో ఆయన రాజకీయాల పైనే మొత్తం దృష్టి పెట్టారు అని తెలుస్తుంది..

-

ప్రభాస్

టాలీవుడ్‌లో డార్లింగ్‌ అని ముద్దుగా పిల్చుకునే ప్రభాస్‌ ఇమేజ్‌ బాహుబలి సిరీస్‌తో అమాంతం ఆకాశానికి ఎగబాకింది. బాహుబలి-2కు ప్రభాస్‌ రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతోపాటు ఓ బాలీవుడ్‌ సినిమా చేస్తున్నారు. మహేశ్‌, పవన్‌ను మించి ప్రభాస్‌ రెమ్యూనరేషన్‌ ఉంటుందని భావిస్తున్నారు.

-

అల్లు అర్జున్

‘సరైనోడు’ సినిమాతో సూపర్‌హిట్‌తోపాటు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ యూట్యూబ్‌లో మోస్ట్‌ వాచెడ్‌ మూవీగా నిలిచింది. తాజాగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా భారీ వసూళ్లతో సూపర్‌హిట్‌ అయింది. వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న బన్నీ.. ఒక్కో సినిమాకు రూ. 14 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా వచ్చిన నా పేరు సూర్య సినిమా కి డివైడ్ టాక్ రావడం తో కాస్త నిరాశలో ఉన్నారు అల్లు అర్జున్..ఈయన సినిమాలు దాదాపు బ్రేక్ ఈవెన్ అవుతాయి.కేరళలో బన్నీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది..

-

రామ్ చరణ్

తన రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో రామ్ చరణ్ తేజ్.. ఆయన ఇప్పటికి 10 సినిమాలు చేశారు, గత సంవత్సరం తండ్రి చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’ని చెర్రీ స్వయంగా నిర్మించాడు. సినిమాకు రూ. 10 నుంచి 14 కోట్ల వరకు చెర్రీ వసూలు చేస్తున్నాడు. తాజా సినిమా ‘రంగస్థలం’ సూపర్‌హిట్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో రెమ్యూనరేషన్‌ మరింత పెంచే అవకాశముంది.

-

రవితేజ

టాలీవుడ్‌ మాస్‌ మహారాజ రవితేజకు మంచి కమర్షియల్‌ ఇమేజ్‌ ఉంది. కొన్ని పరాజయాల అనంతరం ‘రాజా, దీ గ్రేట్‌’ సినిమాతో రవితేజ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘టచ్‌ చేసి చూడు’ , నేల టిక్కెట్టు నిరాశ పరిచాయి. ఒక్కో సినిమాకు రవితేజ రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

-

నాని

పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ సొంతం చేసుకొని వరసగా 6 హిట్ లు సాధించి మంచి జోరు మీద ఉన్న నటుడు నాని , అయితే రీసెంట్ గా వచ్చిన కృషార్జున యుద్ధం సినిమా బాక్సఆఫీస్ వద్ద నిరాశ పరిచింది.ప్రస్తుతం ఇతర సినిమాల్లో బిజీ ఉన్న నాని సినిమాకి 6 నుండి 8 కోట్లు తీసుకుంటారని సమాచారం…

-