మనసారా, కేరింత హీరోయిన్ "శ్రీదివ్య" ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు.!       2018-06-11   00:50:24  IST  Raghu V

‘మనసారా..’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆ తరవాత ‘బస్‌స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో శ్రీదివ్య తమిళ చిత్రసీమ వైపు మళ్లింది. తొలి చిత్రంతోనే సైమా అవార్డు దక్కించుకుంది.

శ్రీదివ్య అనూహ్యంగా రేసులో వెనుకబడిపోయింది. ‘వరుత్తపడాద వాలిబర్‌ సంఘం’తో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె… ‘జీవా’, ‘ఖాకీసట్టై’, ‘ఈట్టి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పోషించినవన్నీ హోమ్లీ పాత్రలే కావడంతో పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

-

ఆ దశలో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘బెంగళూరు నాట్కల్‌’, ‘ఇంజి ఇడుప్పళగి’, ‘పెన్సిల్‌’, ‘కాష్మోరా’ తదితర చిత్రాలు ఆమెను తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఒత్తైక్కు ఒత్త’ చిత్రం మాత్రమే ఉంది.

-

హోమ్లీ పాత్రలతోనే ఎక్కువ కాలం పరిశ్రమలో నిలబడలేమని గ్రహించిన ఈ భామ.. రూటు మార్చేందుకు సిద్ధమైనట్టు కోలీవుడ్‌ టాక్‌. మోడ్రన్‌ పాత్రల్లోను మెప్పించగలనని చెప్పేందుకు ఈమధ్య మోడ్రన్‌ దుస్తుల్లో ఫోటోషూట్‌ల్లో పాల్గొంటోంది. వాటిలో కొన్ని బయటకు రావడంతో శ్రీదివ్య చాలా మారిపోయిందే అనుకుంటున్నారు సినీ జనాలు.