మందార పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు  

మందార పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు- Health Benefits Of Hibiscus Flower - -Telugu Health Tips Life Style Chitkalu(తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు)-Home Remedies ,Arogya Samasyalu ,Doct- Health Benefits Of Hibiscus Flower -

పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను మూలికలు మరియు వేర్ల ను ఉపయోగించి తయారుచేస్తున్నారు.వాటిలో మందార ఒకటి.

మందార పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది.ఆయుర్వేదం మందులలో ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు.

TeluguStop.com - మందార పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న ఉపయోగాల గురించి తెలుసుకుందాం.మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.

1.ఒంటి నొప్పులు


* మందార పువ్వు యొక్క 5 రేకలు మరియు 5 ఆకులు తీసుకోవాలి
* వీటిని నీటిలో వేసి 3 నుంచి 5 నిముషాలు మరిగించి చల్లబరచాలి.అరగంట అయిన తర్వాత త్రాగాలి
* ఈ విధంగా 21 రోజుల పాటు త్రాగితే 70 శాతం ఒంటి నొప్పులు తగ్గుతాయి.

2.ఐరన్ లోపం


* ఎర్ర మందార పువ్వుల నుండి రేకలను విడతీసి నీటిలో వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి
* గది ఉష్ణోగ్రత వచ్చేవరకు చల్లబరచాలి
* చల్లారిన తర్వాత త్రాగాలి
* ఈ విధంగా 21 రోజుల పాటు త్రాగితే ఐరన్ లోపం నుండి బయట పడవచ్చు.

3.ఋతు తిమ్మిరి


* తెలుపు మందార రేకలను తీసుకోని నీటిలో వేసి మరిగించాలి
* చల్లారిన తర్వాత తాగాలి
* ఋతుక్రమ రోజులలో త్రాగితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

4.నిస్పృహ


* తెలుపు మందార రేకలను నీటిలో వేసి 3 నుంచి 4 నిముషాలు మరిగించాలి
* ఈ నీటిని వారంలో ఒకసారి త్రాగాలి
* మెనోపాజ్ కారణంగా వచ్చే నిస్పృహ మరియు మానసిక కల్లోలంలను వదిలించుకోవటానికి సహాయపడుతుంది.అంతేకాక ఎముకలు బలంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Health Benefits Of Hibiscus Flower Related Telugu News,Photos/Pics,Images..