భీమ్ దీక్షలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి మార్గంలో నడవాలని,మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు పవిత్రమైన మాసంగా భావిస్తూ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ పవిత్రమైన జీవన విధానాన్ని గడపాలని,అక్షరం,ఆర్థికం,ఆరోగ్యం మరియు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని,అలాగే రాజ్యాంగ రక్షణ-ఓటు హక్కు పరిరక్షణకై పూనుకోవాలని బిఎస్పి తెలంగాణ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.మంగళవారం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మహనీయుల జయంతి ఉత్సవాల మాసం సందర్భంగా స్వేరో అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

 Rs Praveen Kumar Participating In Bhim Deeksha-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భీమ్ దీక్ష చీప్ కన్వీనర్ పొడపంగి రాధా,గ్రామ సర్పంచ్ గట్టు నరసింహారావు,నిర్వహణ కన్వీనర్ మిర్యాల మధు, కొండగడుపుల ఎల్లయ్య,పిడమర్తి శీను,ముత్యాల కిషన్,మహేంద్రనాథ్,ఎర్ర రాంబాబు,అందే సంజీవ, ఎల్లయ్య,కృష్ణ,నరసింహ,పందిరి రవికుమార్, కమటంశోభ,నవీన్,అంకెపాక శ్రీనివాస్,స్వేరో అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు,జిల్లా ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube