భారత జర్నలిస్టులకి అరుదైన గౌరవం       2018-06-07   01:29:10  IST  Bhanu C

ప్రతిభ ఉన్న ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది…గుర్తింపు కోసం పాకులాడే వ్యక్తులలో ప్రతిభ కనపడదు..సమాజమా మీద ప్రేమ కలుగదు..సమాజ హితం కోరుకునే జర్నలిస్టులకి సమాజమే దేవాలయంగా భావించే జర్నలిస్టులు అరుదుగా కనిపిస్తారు అలాంటి వారిని ఏరి వడబోసి మరీ ప్రపంచవ్యాప్తంగా 18 మందిని గుర్తించారు…అమెరికాలోని మ్యూజియంలో చేర్చారు..ఈ 18 మందిలో మన భారత దేశం కి చెందిన ఇద్దరు పాత్రికేయులకి ఈ గౌరవం దక్కింది. వివరాలలోకి వెళ్తే..

భారతీయ పాత్రికేయులు దివంగత గౌరీలంకేశ్‌, సుదీప్‌దత్త భౌమిక్‌లకు..అమెరికా అరుదైన గుర్తింపుతో కూడిన గౌరవం ఇచ్చింది…ప్రతిష్ఠాత్మక న్యూస్‌ ప్రదర్శనశాల (న్యూజియం)లో చోటు కలిపించింది… వారు పాత్రికేయ వృత్తిలో చూపించిన తెగువ ధైర్య సాహసాలకి గాను ఈ ఘటన దక్కింది. పాత్రికేయుల సంస్మరణార్థం నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 18 మంది పాత్రికేయుల వివరాలను కొత్తగా ఈ మ్యూజియంలో చేర్చారు.

అయితే వీరిలో ఎనిమిది మంది మహిళలు ఎంతో విశేషం పాత్రికేయ వృతికోసం ప్రాణాలర్పించిన 2323 మంది ఫొటోలతో, మరింతమంది వివరాలతో అమెరికాలో గ్లాస్‌తో కూడిన స్మారకభవనం ఉంది… ప్రతీ ఏడాది పత్రికా స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించినవారి వివరాలు, వారి మరణాలకు గల కారణాలతో కొంతమందిని గుర్తిస్తారు. కుల వ్యవస్థ, హిందూత్వంపై జీవితాంతం పోరాడిన గౌరీలంకేశ్‌ను సెప్టెంబరు 5, 2017న ఆమె ఇంటి ముందే కాల్చి చంపారు. త్రిపురలోని స్థానిక పత్రికలో పనిచేసిన సుదీప్‌దత్త భౌమిక పోలీసుల అవినీతి గురించి అనేక కథనాలు రాశారని తెలిపారు..అయితే ఈ భారత పాత్రికేయులకి ఈ గుర్తింపు ఇవ్వడం పట్ల భారత జర్నలిస్ట్ సంఘాలు తమ సంతోషాని వ్యక్తం చేశాయి..అమెరికాకి కృతజ్ఞతలు తెలిపాయి.