బ్లూ ఫిల్మ్ ను తలదన్నే సినిమా తీసిన మారుతి…..       2013-07-30   09:34:21  IST  Raghu V

బూతు సినిమా,అడల్ట్ కంటెంట్ సినిమాలు తీయడంలో దర్శకుడు మారుతికి చాలా అనుభవం ఉంది.ఎక్కడ ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ పెట్టాలో,ఎక్కడ ఏం చూపించాలో ఈయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు.ఈరోజుల్లో,బస్ స్టాప్ సినిమాలు చూసిన వారికి ఈవిషయం ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది.

ఈమధ్యలో ‘ప్రేమకథా చిత్రం…’ అనే ఒక మంచి చిత్రాన్ని తీసి నేను బూతు సినిమాల దర్శకుడిని కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు.కాని పుట్టుకతో వచ్చిన బుద్దులు అంత తొందరగా పోవు అన్నట్లు మళ్ళి ‘రొమాన్స్’ అనే ఒక చిత్రాన్ని మొత్తం బూతు కంటెంట్ తో,డబుల్ మీనింగ్ డైలాగ్ లతో నిoపాడట.ఆగష్టు 2న ఈచిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.ఈరోజు సెన్సార్ పూర్తి అయిన ఈచిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారట సెన్సార్ వారు.అంతేకాక మొత్తం 70 చోట్ల సినిమాకు కత్తిరింపులు జరిపారట.సినిమా అంతా బూతు కంటెంట్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ వారు బిత్తరపోయారట.

సినిమా పేరు రోమాన్స్ బదులు ‘సెక్స్’ అని పెట్టుకోవచ్చుగా అని మారుతికి రెండుసార్లు పంచ్ లు కూడా ఇచ్చారట సెన్సార్ బోర్డ్ సభ్యులు.