బ్రిటన్ లో "ఆ ఎన్నారై" లకి గుడ్ న్యూస్       2018-05-22   02:33:04  IST  Bhanu C

చిన్న చిన్న తప్పిదాలవలన వీసా అవకాశాల్ని కోల్పోయిన వారికి మళ్లీ తిరిగి అవకాశం కల్పించనుంది..ఈ గుడ్ న్యూస్ యూకే హోమ్ ఆఫీస్ ప్రకటించింది..ట్యాక్స్‌…రిటర్న్స్‌లో చేసిన చిన్న చిన్న తప్పిదాలకు దేశంలో ఉండటానికి, పనిచేయడానికి అనుమతి నిరాకరించిన కేసులను సమీక్షిస్తామని యూకే హోమ్‌ ఆఫీస్‌ ప్రకటించింది.

అయితే ఈ విషయం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ హోమ్‌ అఫైర్స్‌ సెలక్ట్‌ కమిటీ ముందు ఈ అంశం చర్చకు వచ్చింది…చాలా చిన్న తప్పులకు క్షమించదగిన తప్పుల్ని సైతం పెద్దవిగా చూడటం అత్యంత నైపుణ్యం కల్గిన విదేశీయులకు వీసాలు నిరాకరించడం ఎంతవరకు సమంజసం? అని బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ వ్యవహారాల మంత్రి కారొలైన్‌ నోక్స్‌ను కమిటీ ప్రశ్నించింది.

మీరు ఇలా చేయడం దేశానికే తప్పుడు సంకేతాలు పంపినట్టుగా ఉండదా..? భారత్ సహా ఎన్నో దేశాల పౌరులు తమ నైపుణ్యంతో అభివృధ్ధికి తోడ్పడలేదా? అని కమిటీలోని స్వతంత్ర ఎంపీ జాన్‌ ఉడ్‌కుక్‌ నిలదీశారు..అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నైజీరియాలకు చెందిన డాక్టర్లు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తల వీసా కేసులను సమీక్షిస్తామని ఇమిగ్రేషన్‌ మంత్రి నోక్స్‌ భరోసా ఇచ్చారు.