బీజేపీ రూట్ మ్యాప్ తేడా కొడుతోందా ? 

జనసేన పార్టీ విషయంలో బిజెపి ఏ వైఖరి తో ఉందో ఎవరికీ అర్థం కావడంలేదు.ఏపీలో బీజేపీ తో జనసేన పొత్తు పెట్టుకుంది.

 Janasena Pawan Kalyan Confusing With Bjp Route Map Details, Bjp, Ysrcp, Pavan Kalyan, Janasenani, Ap Government, Somu Veeraju, Janasenani,cbn, Tdp Aliance, , Bjp Route Map, Janasena Bjp Alliance, Cm Jagan Mohan Reddy, Chandrababu Naidu-TeluguStop.com

కానీ ఏ విషయంలోనూ జనసేనను సమన్వయం చేసుకుంటూ బీజేపీ ముందుకు వెళ్లడం లేదు.అలాగే బిజెపిని పట్టించుకోనట్లు గా  జనసేన వ్యవహరిస్తోంది.

ఈ రెండు పార్టీలు విడివిడిగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.కానీ 2024 ఎన్నికల్లో మాత్రం కలిసే పోటీ చేస్తామని రెండు పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి.

 Janasena Pawan Kalyan Confusing With Bjp Route Map Details, BJP, YSRCP, Pavan Kalyan, Janasenani, Ap Government, Somu Veeraju, Janasenani,cbn, TDP Aliance, , Bjp Route Map, Janasena Bjp Alliance, Cm Jagan Mohan Reddy, Chandrababu Naidu-బీజేపీ రూట్ మ్యాప్ తేడా కొడుతోందా  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు రద్దు చేసు కుంటారని,  టిడిపితో కలిసి ముందుకు వెళ్తారని అంతా భావించినా,  పవన్ మాత్రం బిజెపి రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని, ఆ పార్టీతో కలిసి ఉంటామని ప్రకటనలు చేయడంతో రెండు పార్టీలతో కలిసి టిడిపిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ప్లాన్ పవన్ చేశారు.

టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి ఏ మంత్రం ఇష్ట పడడం లేదు.

అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లోనూ టిడిపితో కలవద్దని పవన్ కు బీజేపీ పెద్దలు హితబోధ చేయడంతో అదే బీజేపీ రూట్ మ్యాప్ గా పవన్ భావిస్తున్నారు.అయితే తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీతో బిజెపి కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉండడం పవన్ కు ఆగ్రహం కలిగిస్తోంది.

Telugu Ap, Bjp Route Map, Chandrababu, Cmjagan, Janasenabjp, Janasenani, Pavan Kalyan, Somu Veeraju, Tdp Aliance, Ysrcp-Political

ఏపీలో బిజెపి నాయకులు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న,  కేంద్ర బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందించడంతో పాటు, ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉండటం,  అలాగే వైసిపి సైతం కేంద్రంలో బిజెపి ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు పలుకుతూ,  కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉండటం వంటివి పవన్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయి.వైసీపీ విషయంలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు పవన్ కు అయోమయం కలిగిస్తోంది.దీంతో జనసేన , వైసిపి విషయంలో బిజెపి రూట్ మ్యాప్ ఏమిటనేది పవన్ కు అర్థం కావడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube