బీజేపీ కి హ్యాండ్ ఇవ్వనున్న చంద్రబాబు       2017-09-14   03:45:54  IST  Bhanu C

2019 లో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారు అనే విషయం లో ఎవరికీ వారు మేమంటే మేము అంటూ ధీమాగా ఉన్నాయి. వైఎస్సార్ పార్టీ బీజేపీ తో ,ఇంకా కలిసి వచ్చే వాళ్ళు ఎవ్వరు ఉన్నా సరే ఆహ్వానం పలుకుతోంది. అధికారంలోకి రావడానికి కలిసొచ్చే ఏ అంశాన్ని కూడా వదులుకునే సాహసం చేయడం లేదు జగన్. ఇంకా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ,ఎన్ని చోట్ల పోటీ చేస్తాడో ఆయనకే తెలియదు అని బహిరంగంగానే చెప్తున్నాడు. కానీ అధికార పక్షం అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వైఖరి చూస్తుంటే మళ్ళీ ఎదో చాణిక్య పధకం ఉందనే అనిపిస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గతకొన్ని రోజులుగా చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ చాలా సందర్భాలలో మాట్లాడుతూ 2019 లో వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో గెలుపు మాదే అని చెప్తువస్తున్నారు.అంతేకాదు 175 నియోజకవర్గాలలో గెలుపు దిశగా ప్రణాళికలు కూడా వేస్తున్నారు.ఇక్కడే బేజెపీ నాయకులకి అనుమానం కలుగుతోంది.వచ్చే ఎన్నికల్లో బీజీపీ తో పొత్తు పెట్టుకుందాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతగా వేరే స్కెచ్ వేసుకుంటున్నారు అనే డౌట్ మొదలయ్యింది. వచ్చే ఎన్నికల్లో వీళ్ళ ఇద్దరిమధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది డౌటే అని ఏపీ బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.

బేజెపీ నాయకులకి ఉన్న అనుమానాలకి తగ్గట్టుగా టీడీపీ చేసే ప్రతీ పని బీజీపీ కి చెక్ పెట్టేలా ఉన్నాయి.ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం కూడా 175 నియోజకవర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.మిత్రపక్షం అయిన బీజేపీ ఎమ్మెల్యేలున్నఉన్న చోట టీడిపి ఈ కార్యక్రమాన్ని నిర్వచించడం వారికి మరిన్ని అనుమానాల్ని కలిగిస్తోందని మిత్రపక్షం అయిన మమ్మల్ని దూరంగా పెట్టాలన్న యోచనలో ఉన్నట్లుందని శాసనసభాపక్ష నేత విష‌్ణుకుమార్ రాజు చెప్పారు అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఒకవేళ పొత్తు ఉంటే మిత్రపక్షాలతో కలిసి 175 నియోజకవర్గాలలో గెలుస్తాం అనాలి కదా అంటున్నారు బీజేపి నాయకులు. మొత్తానికి బాబు లోకేష్ ల మాటలు చూస్తూ ఉంటే బీజేపీ కి చంద్రబాబునాయుడు హ్యాండ్ ఇచ్చేలానే ఉన్నారు.