బీజేపీకి మతి పోయిందా... బాబు పై చార్జిషీటా..  

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ తో తెగ తెంపులు చేసిన నాటినుంచీ ఈ రోజు వరకూ కూడా అవినీతి ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు బీజేపీ పెద్దలు.ఒక పక్క ప్రభుత్వ పాలన బెష్ అంటూనే మరో పక్క రాజకీయ నేతలతో అవినీతి ఆరోపణలు చేయించడం బీజేపీ కి మాత్రమే చెల్లింది అయితే ఏపీలో క్రింద స్ధాయి నుండి పై స్ధాయి వ‌ర‌కూ అవినీతి పెరిగిపోయింది. అందుక‌నే త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై చార్జిషీటు తీసుకువ‌స్తున్నాం…ఇక బాబు కి మూడినట్టే అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి..

Bjp Want To Put Charge Sheet On Chandrababu Naidu-

Bjp Want To Put Charge Sheet On Chandrababu Naidu

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముర‌ళీధ‌ర్ రావు ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీ బిజీ గా ఉంటూ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పై అవినీతి విమర్శలు చేస్తూ వచ్చారు.. అంతేకాదు బాబు అవినీతిని కూకటి వేళ్ళతో పీకేస్తామని ప్రకటన చేశారు అక్కడితో ఆగకుండా ఎక్క‌డెక్క‌డ అవినీతి జ‌రిగింది, ఏ స్ధాయిలో జ‌రిగింద‌నే విష‌యాల‌పై వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు కూడా తెలిపారు అయితే బాబు పాలన పరంగా కానీ మరే ఇతర విషయాల పరంగా ఎలాంటి అడుగులు వేసినా ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియకుండా ఉండదని అంటున్నారు పరిశీలకులు అయితే..

నాలుగేళ్ళు కలిసి కాపురం చేసి ఇప్పుడు అవినీతి ఆరోపణలు అంటగడితే ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని ఏపీ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజు ఒకటి వస్తుందని టీడీపీ నేతలు సైతం ప్రతి విమర్శలు చేస్తున్నారు అయితే చంద్ర‌బాబుపై నిజంగా చార్జిషీటు పెట్టాలంటే ఇంకా అవినీతిపై వివ‌రాలు సేక‌రించాల్సిన అవ‌స‌రం ఏంటి ? ప‌ట్టిసీమ‌లో జరిగిన అవినీతి అంటూ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ బీజేపీ చేతిలోనే ఉంది కదా మరి అలాంటప్పుడు ఎందుకు బీజేపీ ఆచి తూచి వ్యవహరిస్తోంది..? పిడి ఖాతాల రూపంలో రూ. 53 వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని చెబుతున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహారావు ఆరోప‌ణ‌లు చంద్రబాబు ని జైల్లో పెట్టడానికి సరిపోవా..?

Bjp Want To Put Charge Sheet On Chandrababu Naidu-

అయితే చంద్రబాబు ని జైల్లో పెట్టడానికి ఓటుకు నోటు కేసు సరిపోదా మరి ఎందుకు బీజేపీ కొత్త కొత్త ఆరోపణలు చేస్తూ జైలుకి పంపుతాం అంటూ ఉత్తర కుమారా ప్రగల్భాలు పలుకుతోంది అంటే దానికి ఒకటే కారణం ఇప్పటికే ఏపీ కి ప్రత్యెక హోదా ఇవ్వలేదని ఏపీ ప్రజలు కేంద్రంపై కస్సు బస్సు మంటున్నారు..ఇలాంటి తరుణంలో బాబు ని గనుకా జైల్లో పెడితే తప్పకుండా ఈ ఎఫెక్ట్ బీజేపీ పతనం వరకూ తీసుకు వెళ్తుంది అంతేకాదు టీడీపీ కి సానుభూతి పెరిగి బాబు కి ఇంకా ప్లస్ అవుతుంది తప్ప ఉపయోగం ఉండద..అందుకే జైలు చార్జిషీట్ అంటూ బయపెట్టే ఆరోపణలు తప్ప అవి ఆచరణలోకి వెళ్ళే అవకాశమే లేదని అంటున్నారు పరిశీలకులు.