ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మేరకు నాగర్ కర్నూల్ లో ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు.
ప్రజల్లో పరిణితి వస్తే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని కేసీఆర్ తెలిపారు.మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పాలన బాగుంటుందని చెప్పారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్నారు.కృష్ణా, గోదావరి పక్కనే ఉన్నా గతంలో కాంగ్రెస్ మనకు మంచినీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.
ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్నారు.బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రూ.5 వేలు పెన్షన్ తో పాటు రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.