బిడెన్ గెలుపు కోసం ట్రంప్ భారీ సాయం..!!!  

Trump Helping for Biden Win, Joe Biden, America Elections, Donald Trump, Presidential Debate, Indo americans, Trump Behavior - Telugu America Elections, Donald Trump, Indo Americans, Joe Biden, Presidential Debate, Trump Behavior, Trump Helping For Biden Win

అగ్ర రాజ్యం అమెరికాలో మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ప్రపంచం యావత్తు ఎంతో ఆసక్తిగా ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది.

TeluguStop.com - Donald Trump Joe Biden America Elections Debate

ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో డెమోక్రటిక్ పార్టీ, మళ్ళీ అధికారం సాధించాలనే కోరికతో రిపబ్లికన్ పార్టీ రెండూ గట్టి పోటీ ఇస్తున్నాయి.ప్రచారం మొదలు అన్ని విషయాలలో ఒకరిపై ఒకరు ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు.

ఇదిలాఉంటే అమెరికా స్థానిక మీడియా మొదలు పలు సర్వేలు సైతం ఈ సారి ఎన్నికల్లో గెలిచేది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ అని తేల్చి చెప్తున్నాయి.ఇదిలాఉంటే

TeluguStop.com - బిడెన్ గెలుపు కోసం ట్రంప్ భారీ సాయం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ గెలుపుకోసం ట్రంప్ తీవ్రంగా కష్టపడుతున్నారని, భారీ స్థాయిలో డబ్బు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.

అంతేకాదు ట్రంప్ తీరుపై రిపబ్లికన్ పార్టీ సైతం గుర్రుగా ఉందని తెలుస్తోంది.బిడెన్ గెలుపుకోసం ట్రంప్ కష్టపడటం ఏమిటి అనుకుంటున్నారా ఇంతకీ ఇందులో ఉన్న లాజిక్ ఏమిటంటే.

ట్రంప్ సహజ శైలి, మాట్లాడే తీరు, అతడి నిర్ణయాలు ముందు నుంచీ ప్రజలలో వ్యతిరేక భావాలని తెచ్చిపెడుతూ వచ్చాయి.ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఒక్కో సారి అసలు ఇలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ఎలా అయ్యాడు, మరో సారి అధ్యక్ష అభ్యర్ధిగా ఎలా నిలుచున్నాడు అనే సందేహాలని రేకెత్తిస్తూ ఉంటాయి.

తాజాగా బిడెన్ చేసిన వ్యాఖ్యలు బిడెన్ గెలుపులో కీలక పాత్రని పోషించనున్నాయని అంటున్నారు నిపుణులు.

బిడెన్, ట్రంప్ ఇరువురి మధ్య జరిగిన డిబేట్ లో ట్రంప్ తన అసలు వ్యక్తిత్వాన్ని మరో సారి బయటపెట్టుకున్నాడు.

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించాలంటే భారతీయుల ఓట్లే అత్యంత కీలకంగా ఉన్న తరుణంలో భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నాడు ట్రంప్.భారత్ లో వాయు కాలుష్యం ఎక్కువ అక్కడ గాలి గబ్బు వాసన వస్తుందని నోటికి వచ్చినట్టు ట్రంప్ వాగేశారు.

కాలుష్యం కట్టడి చేయడానికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మోడీ పరువు గంగలో కలిపాడు.దాంతో అమెరికా వ్యాప్తంగా ఉన్న ఇండో అమెరికన్స్ ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

గతంలో భారతీయ అమెరికన్స్ మద్దతు ఇరువురు అభ్యర్ధులకు సమానంగా ఉండేదని కానీ తాజా పరిణామాలతో బిడెన్ వైపు ఇండో అమెరికన్స్ మొగ్గు చూపనున్నారని, గెలుపు కోసం ట్రంప్ లక్షల కోట్లు ఖర్చు పెట్టిన మొత్తం బిడెన్ గెలుపులో భాగం కానున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

#Donald Trump #TrumpHelping #Indo Americans #Trump Behavior #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Donald Trump Joe Biden America Elections Debate Related Telugu News,Photos/Pics,Images..