బిగ్‌బాస్‌ను తరుణ్‌ అంతమాట అనేశాడేంటి!       2018-05-31   20:44:17  IST  Raghu V

సినిమాల్లో అవకాశాలు లేని వారు, క్రేజ్‌ ఉండి ఛాన్స్‌లు దక్కని వారు ప్రస్తుతం బిగ్‌బాస్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. బిగ్‌బాస్‌లో కనిపించడం వల్ల నాలుగు రాల్లు వెనకేసుకోవడంతో పాటు క్రేజ్‌ కూడా దక్కుతుందని అంతా భావిస్తున్నారు. అందుకే రెండవ సీజన్‌లో పాల్గొనేందుకు సెలబ్రెటీలు పోటీలు పడ్డట్లుగా తెలుస్తోంది. తెలిసిన వారితో పైరవీలు చేయించుకున మరీ స్టార్‌ మా వారి దృష్టిలో పడి, బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో స్థానం సంపాదించారు. మరో వారం రోజుల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం కాబోతుంది. నాని హోస్ట్‌గా ప్రసారం కాబోతున్న ఈ షోలో అప్పటి లవర్‌ బాయ్‌ తరుణ్‌ కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తరుణ్‌ కొట్టి పారేశాడు.

బిగ్‌బాస్‌లో తాను కనిపించబోతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశాడు. తాను ఎప్పుడు కూడా బిగ్‌బాస్‌కు వెళ్లాలని కోరుకోలేదు అని, అయినా నాకు ఆ అవసరం లేదని, చిన్న చిన్న ఆర్టిస్టులకు అది అవసరం అంటూ చెప్పుకొచ్చాడు. హీరోగా తనకు క్రేజ్‌ లేకున్నా కూడా బిగ్‌బాస్‌కు వెళ్లి సంపాదించుకోవాలి, బిగ్‌బాస్‌ వల్ల క్రేజ్‌ను దక్కించుకోవాలని నాకు లేదని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ వారు నన్ను సంప్రదించలేదు అని, ఒక వేళ సంప్రదించినా కూడా తాను నో చెప్పేవాడిని అంటూ తరుణ్‌ తాజాగా మీడియాకు చెప్పుకొచ్చాడు.

తెలుగులో అందని ద్రాక్ష పుల్లనా అంటూ ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇప్పుడు తరుణ్‌ మాటలు వింటుంటే గుర్తుకు వస్తుంది. బిగ్‌బాస్‌లో ఆఫర్‌ రాలేదు కనుకే అతడు ఆ ఆఫర్‌ను వచ్చినా తిరష్కరించేవాడిని అంటున్నాడు. తరుణ్‌ కంటే ప్రస్తుతం మంచి క్రేజ్‌ ఉన్నవారు చాలా మంది బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు. తరుణ్‌ను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఆయన్ను తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనే అభిప్రాయం స్టార్‌ మా వారు వ్యక్తం చేసినట్లుగా ఉన్నారు. అందుకే తరుణ్‌ పేరు ప్రస్థావనకు వచ్చినా కూడా వారు లైట్‌ తీసుకున్నారు.

తరుణ్‌ మాత్రం తనకు బిగ్‌బాస్‌తో అవసరం లేదు, ఒకవేళ బిగ్‌బాస్‌కు నేను అవసరం అనుకున్నా కూడా నేను నో చెప్పేవాడిని అంటూ వింత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. బిగ్‌బాస్‌లో పలువురు సెలబ్రెటీలు ఎంపిక అయ్యారు. మొత్తం 16 మందిలో నలుగురు సామాన్యులు కనిపించనుండగా, 12 మంది సెలబ్రెటీలు కనిపిస్తారని సమాచారం అందుతుంది. కాని కొందరు మాత్రం సగం మంది సామాన్యులు సగం మంది సెబ్రెటీలు అంటూ అంచనా వేస్తున్నారు. జూన్‌ 10న ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.