బావా నువ్వంటే నాకిష్టం.. మీ నాన్న నాపై చాలా సార్లు అత్యాచారయత్నం..!!       2018-05-19   07:39:32  IST  Raghu V

ఈమధ్య చిన్న చిన్న మనస్పర్ధలకు ప్రాణాలను తీసుకోవటం, తీసేయ్యటం రెండూ పరిపాటి గా మారాయి… సంసారం లో ఏ చిన్న గొడవ వచ్చినా, అత్త పోరు పెట్టినా, భర్త బదులు ఇవ్వకపోయినా తీవ్రమనస్తాపానికి లోనయి ఎటూ తాళలేక చివరికి మరణమే శరణ్యమని భావించి తమ ప్రాణాలను తీసుకోవడమే కాకుండా, ఏమి తెలియని పసిగుడ్డుల గొంతులను నులిమేస్తున్నారు అమాయకపు తల్లులు… తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లాలోని నన్పూర్‌ మండలంలో

చక్కగా బీటెక్‌ చదివి, ఉద్యోగం చేస్తున్న కోడలిని ఆ నయవంచకులు.. చేస్తున్న ఉద్యోగం మాన్పించి మరీ ఇంటికే పరిమితం చేశారు. పైగా అదనపు కట్నం కోసం అత్తామామలు, ఆడపడుచు ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేసేవారట. అవన్నీ భర్తతో చెప్పుకుని బాధపడినా పట్టించుకోలేదట. పైగా వారికే సపోర్టు చేసేవాడట. దీంతో ఇక ఆ ఇల్లాలికి జీవితమే చీకటిగా తోచింది. కన్నకూతుర్ని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాలోని నన్పూర్‌ మండలానికి చెందిన ఓ సింగరేణి కార్మికుడు పాగాల రాంరెడ్డి, అరుణ దంపతుల పెద్దకూతురు విజ్ఞులత. ఐదేళ్ల క్రితం ఆ అమ్మాయిని మంచిర్యాలకు చెందిన రామకృష్ణారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో వివాహ లాంఛనాల కింద రూ. 16 లక్షలు, ఇతర కానుకలు కూడా ముట్టజెప్పామని అమ్మాయి బంధువులు చెబుతున్నారు. ఇక..

విజ్ఞులత, రామకృష్ణారెడ్డి దంపతులకు కూతురు క్రిషికారెడ్డి ఉంది. రామకృష్ణారెడ్డి తండ్రి మోహన్‌రెడ్డికి శ్రీరాంపూర్‌ పెట్రోల్‌బంక్‌ ఉంది. కొడుకు రామకృష్ణారెడ్డి అందులోనే పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం అత్తామామలిద్దరూ హైదరాబాద్‌లోని వారి కూతురు ఇంటికి వెళ్లారు. అదేరోజు విజ్ఞూలత ఆమె భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని విజ్ఞూలత తన తల్లి అరుణకు ఫోన్‌ చేసి చెప్పింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బుధవారం మధ్యాహ్నం కూతుర్ని బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు చీరను బిగించి ఉరివేసింది విజ్ఙులత. తర్వాత ఆమె కూడా చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విజ్జూలత సూసైడ్ నోట్‌లో ఇలా ఉంది…

బావా…మీ అమ్మా నాన్నలకు నేనంటే ఇష్టం లేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మానాన్న తిడుతుంటే పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెండ్లి చేస్తరు.. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో. లేకపోతే ఆ వచ్చేదాన్ని కూడా ఇలాగే టార్చర్ పెడ్తరు. అంతేకాదు నిన్ను కూడా టార్చర్ పెడ్తరు. నేను ఒక పెద్ద తప్పు చేసిన. అది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడం. ఇది కూడా మీ అమ్మకు ఇష్టంలే. నేను మీ అమ్మకు అన్ని పనులు చేసిపెట్టినా చేయలేదనే అంటుంది. గిన్నెల తోమకపోతే పోలీస్ ఆంటీ ఇంటికి పోయి చెప్పుతుంది. అన్ని పనులూ చేసి.. ఒకనాడు పొట్టనొస్తుందని బయట కింద కూర్చును గిన్నెలు తోమలేదు అంతే. నువ్వు మీ అమ్మ మాట దాటకు… కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. మీ నాన్నకేమో ఇంకా కట్నం కావాలని ఉంది. మీ అమ్మానాన్నలకు మా నాన్నంటే ఇష్టం లేదు.

అందుకే నా మీద పగ తీర్చుకుంటున్నారు. నా కూతురు తల్లిలేని పిల్ల కావద్దనే ఆమెను కూడా చంపతున్నా అంతే. నువ్వు మీ అమ్మానాన్న, మీ అక్కతో సంతోషంగా ఉండు. మ్యారేజీ అయినప్పటి నుంచి నువ్వు మీ అమ్మానాన్న, ముఖ్యంగా మీ అక్క దగ్గర రూ.రూ.7వేలు శాలరీ కింద పనిచేస్తున్నావు. నేను చనిపోతే నీకు మీ అమ్మ, నాన్న, అక్క శాలరీ పెంచుతారు. సంతోషంగా ఉండు…. అంటూ సూసైడ్ నోట్‌ను తన భర్త పనిచేస్తున్న పెట్రోల్ బంకుకు సంబంధించిన పేపర్‌లోనే విజ్జూలత రాసిపెట్టింది. అయితే ఈ విషయమై…. విజ్ఞులత భర్త తండ్రి అయిన మోహన్‌రెడ్డి తన కూతురిపై పలుమార్లు అత్యాచారయత్నం చేశాడనీ, విజ్జూలత ఈ విషయాన్ని తమతో అనేక సార్లు చెప్పిందంటూ బోరుమన్నాడు.

ఈ విషయాన్ని ఆమె భర్త రామకృష్ణారెడ్డికి చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందన్నాడు.. అదనపు కట్నం కోసం ఏడాది క్రితం ఇంటి నుంచి గెంటివేశారనీ ఆరోపించాడు. పంచాయతీ నిర్వహించి, పంపామనీ, ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యాడు. తన కుమార్తె, మనవరాలిది ఆత్మహత్యలా? హత్యలా? అనే కోణంలో విచారణ జరిపించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.