బాలుడి సాహసం.. తల్లి ప్రియుడికి బుద్ధి చెప్పాలని ఎంతపని చేశాడు.. ?  

nagapur, 15 years boy, kidnaped, mother boy friend - Telugu 15 Years Boy, Kidnaped, Mother Boy Friend, Nagapur

తన తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పలని ఓ కుర్రాడు వేసిన ప్లాన్ బెడిసికొట్టగా చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.ఆనందంగా జీవితాని గడపవలసిన వయస్సులో ఇలాంటి పని చేయడం చెడిపోయిన నేటి సమాజానికి నిదర్శనం.

TeluguStop.com - Boy Kidnaped Mother Boy Friend

ఇక ఆ వివరాలు చూస్తే.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన చెందిన 15 ఏళ్ల బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్‌పై తీసుకెళ్లేలా ప్రణాళిక రచించి దాన్ని అమలుచేసే క్రమంలో ఆ కుర్రవాడి స్నేహితులతో కలసి తల్లి ప్రియుడైన నందన్వర్‌ ను కిడ్నాప్ చేశాడు.

అదే సమయంలో వారికి పోలీస్‌ పెట్రోలింగ్ వాహనం కనపడటంతో ఇదే అదనుగా భావించిన నందన్వర్‌ రన్నింగ్‌ బైక్‌ నుంచి దూకేసి పారిపోయాడు.

నేరుగా ఈ విషయాన్ని ఆ బాలుడి తల్లికి చేరవేసి, పనిలో పనిగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఆ విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించారు.ఇక వీరంతా మైనర్ బాలురు కావడంతో అందులో వీరిపై ఇదివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డ్ కూడా లేదు అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.

#15 Years Boy #Kidnaped #Nagapur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు