బాబోయ్ బాబు ! ప్రచారానికి రావొద్దు అంటూ..?  

Dont Come To Election Campaign Babu-delhi,elections,political Updates,ప్రచారానికి రావొద్దు అంటూ

ఏపీలో ఎన్నికలు ముగిసిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కొంచెం రిలీఫ్ అయ్యాడు. ఈవీఎం లలో అవకతవకలు జరిగాయి అంటూ హడావుడి చేసిన బాబు ఆ తరువాత బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయాడు. మొన్నటివరకు ఏపీలో వైసీపీ ‘నిన్ను నమ్మం బాబు’, జాబు రావాలంటే బాబు పోవాలి ఇలా అనేక నినాదాలతో వినూత్నంగా ప్రచారం చేసింది. ఆ ప్రచారం ఏపీలో బాగానే వర్కవుట్ అయినట్టే కనిపించింది..

బాబోయ్ బాబు ! ప్రచారానికి రావొద్దు అంటూ..?-Dont Come To Election Campaign Babu

ఇప్పుడు అదే నినాదాలు పక్క రాష్ట్రాల్లో కూడా వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి సాగుతున్న చంద్రబాబు వారితో మంచి సంబంధాలు నడుపుతున్నాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం బాబు ఢిల్లీలో దీక్ష చేపట్టినప్పుడు చాలామంది ఆయనకు మద్దతు కూడా తెలిపారు.

ఇక ఏపీ ఎన్నికల సందర్భంగా కూడా చాలామంది ఇతర రాష్ట్ర నాయకులు ప్రచారానికి వచ్చారు. ఆ కృతజ్ఞతతో బాబు ఇప్పుడు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో తన పర్యటన చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఆయా రాష్ట్రాల్లోని బాబు మిత్రులు మాత్రం చంద్రబాబు ప్రచారానికి రావడం కంటే రాకపోవడమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీలో పోలింగ్ కంప్లీట్ అయిన తరువాత చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి దేశం దృష్టిని ఆకర్షించారు. దీనికి ఆయన మిత్రపక్షాల్లో కొంతమంది నుంచి సానుకూలత ఉన్నా మరికొంతమంది నుంచి మాత్రం ఆయన పోరాటంపై పెద్దగా ఆసక్తిగా లేరు.

తమ తమ రాష్ట్రాల్లో బ్యాలట్ విధానం కంటే ఈవీఎం ల ద్వారానే తాము గెలుస్తామనే ధీమా ఉండడం, లోక్ సభ సీట్లలో ఎక్కువ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండడడంతో ఈవీఎం లను వ్యతిరేకించేందుకు వారు మొగ్గుచూపడంలేదు. ఈ దశలో వాటిని వ్యతిరేకిస్తున్న బాబు ని ప్రచారానికి దింపడం వల్ల అనవసర గందరగోళం తప్పదేమో అన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది.

ఈ విషయంలో ఆయా రాష్ట్రాల్లోని విపక్షాలు కూడా ఈవీఎం ల విషయాన్ని లేవనెత్తితే అనవసరంగా ఇరుక్కోవాల్సి వస్తుంది అని అందుకే బాబు ని ప్రచారానికి దించడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అన్న ఆలోచనలో ఆయా రాష్ట్రాల్లోని బాబు రాజకీయ మిత్రులు ఉన్నారట.