బాబు వ్యూహంతో క‌న్న‌డ‌నాట బీజేపీకి చుక్క‌లే  

  • మోదీ వ‌ద‌ల నిన్నొద‌ల అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోగాక‌, విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌లేద‌ని ఎన్డీఏ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న‌ బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. ఏపీకి బీజేపీ నేత‌ల‌తో పాటు ప్ర‌ధాని మోదీ తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా ఏకిపారేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే బీజేపీకీ ప‌ట్టేలా చేయ‌డంలో సక్సెస్ అయ్యారు. ఏపీలో ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయేలా చేశారు. ఇప్పుడు ప‌క్క రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లోనూ బీజేపీని వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.

  • -

  • క‌ర్ణాట‌క‌లో గెలుపు కోసం బీజేపీ పెద్ద‌లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతు న్నారు. క‌ర్ణాట‌క‌లో తెలుగువారు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపించాల‌ని భావిస్తున్నార‌ట‌. తెలుగువారి స‌త్తా మోడీకి చూపించాల‌ని బాబు పావులు క‌దుపుతున్నార‌ట‌.
    క‌ర్ణాట‌క రాజ‌కీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నువ్వా-నేనా అంటూ పోటీ ప‌డుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇలా కత్తులు దూసుకుంటుంటే బీజేపీని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

  • మోదీని దెబ్బతీసేందుకు ఏ ఒక్క అవకాశం వచ్చినా వదల కూడదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో తెలుగు వారు నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరు ఎన్నికల్లో వీరు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇటీవలే ప్రత్యేక హోదా విషయంలో కర్నాటకలోని తెలుగు వారు చంద్రబాబును కలువగా బీజేపీని ఓడించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నమ్మించి ద్రోహం చేసిన మోదీకి కర్ణాటక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

  • బెంగళూరు సిటీ, ఏపీ బోర్డర్‌లోని జిల్లాల్లో తెలుగువారు, వారి బంధువులు అధికంగానే ఉన్నారు వీరందరిని ఉపయోగించి మోదీకి తన సత్తా చూపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు వంటి సెంట్ మెంట్ లతో తెలుగు వారికి కళ్లెం వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కర్ణాటకలో తెలుగు వారిని తమ వైపున‌కు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ నేతలు రంగంలోకి దింపారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రయత్నాలన్నీ ఎన్డీఏ నుంచి వైదొలగక ముందు నుంచే చంద్రబాబు చేస్తున్నట్లు బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

  • గుజరాత్‌లోనూ బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని మంత్రి నారా లోకేష్‌, తన ఇద్దరు మిత్రులకు డబ్బులు ఇచ్చి గుజరాత్‌కు పంపారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అక్కడి తెలుగువారికి బీజేపీని ఓడించమని సూచించటం బహిరంగ రహస్యమే. ఏపీ ప్రజల్లో కూడా ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ బాగా ఉండటంతో కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు భావిస్తోంది కాంగ్రెస్‌. ప్రభుత్వ పరంగా వైఫల్యాలు, ఆరోపణలతో కొట్టుమిట్టా డుతున్న బీజేపికి కర్ణాటకలో టీడీపీ ప్ర‌య‌త్నాలు మింగుడుపడటం లేదు.