బాబు వద్దనుకున్న “ఆ 40 మంది”..జనసేన లోకి   TDP 40 Mla’s Touch With Pawan Kalyan     2018-03-20   21:59:14  IST  Bhanu C

ఏపీ అధికార పార్టీ అయిన టిడిపి పార్టీ నుంచీ సుమారు 40 మంది ఎమ్మెల్యేలు జనసేన వైపు వేల్లనున్నరనే టాక్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది…ఈవార్తే నిజం అయితే టిడిపి పై తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడం ఖాయం ఇప్పటికే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో టిడిపి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారని ఓపెన్ గానే అర్థం అవుతూనే ఉంది.అయితే ఇప్పుడు ఈ 40 మంది ఎమ్మెల్యేలు పవన్ వెంట నడిస్తే ఏపీలో టిడిపి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఈ విషయంపైనే తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.

రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో పవన్ ప్రవర్తనా వైఖరిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే చంద్రబాబు వద్ద నున్న 40 మంది ఎమ్మెల్యేలు ఎలా పవన్ కి టచ్ లో ఉన్నారనే విషయం టిడిపి నేతలకి అంతుబట్టడం లేదు..ఒక్కసారిగా ఏపీలో పవన్ చేసిన కామెంట్స్ కి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి..బీజేపి ,వైసీపి ,జనసేన ఒక్కటి అయ్యిపోయి చంద్రబాబు ని ఒంటరిగా చేసేశాయి..తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలలో 103 మంది ఎంఎల్ఏల్లో 40 మంది టచ్ లో ఉన్నారని చెప్పడంతో చంద్రబాబు కి కంటిమీద కునుకు కూడా పడటం లేదు..

అయితే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పాలి ఎలా అంటే..చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ లు పెట్టిన ప్రతీ సారీ సర్వేలు చేయించాను 40 మీద రిపోర్ట్ తేడాగా వచ్చింది అంటూ తమ దారికి తెచ్చుకోవడానికి బెదిరింపులు చేసేవారు..అయితే ఎప్పుడు చాన్సే వస్తే పక్క పార్టీలోకి వేల్ల్లిపోదమా అని చూస్తున్న వాళ్ళందరికీ గోల్డెన్ ఛాన్స్ జనసేన రూపంలో వచ్చింది..ఇప్పుడు వీళ్ళు అందరు టిడిపి నుంచీ పవన్ పార్టీలోకి వెళ్లి అక్కడ నుంచీ పోటీ చేయాలనేది ఆలోచన అయితే వచ్చిన వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేకపోయినా సరే ఈ 40 మంది మాత్రం తప్పకుండా పవన్ కి జై కొడతారని టాక్ వినిపిస్తోంది..

ఇప్పటికే టిడిపి నుంచీ వైసీపిలోకి టిడిపి కీలక నేతలు కొంతమంది జంప్ చేయగా ఇప్పుడు. చంద్రబాబు వద్ద ఉన్న ఈ 40 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు జనసేనలోకి వెళ్లి పోతారోననే టెన్షన్ టిడిపి పార్టీలో తీవ్రమైన ఉత్కంటని కలిగిస్తోంది..మరి చంద్రబాబు ఈ సమస్యలన్నిటికీ ఎలాంటి పరిష్కారాలని వెతుకుతారో..? జనసేన దూకుడుకి ఎలాంటి చెక్ పెడుటారో అనేది త్వరలోనే తేలిపోనుంది..